క్రైమ్ మిర్రర్, పాలిటిక్స్:- తమిళనాడు బీజేపీ నాయకుడు, మాజీ ఐపీఎస్ అధికారి అన్నామలై బీజేపీని వీడుతున్నట్టు కొద్దిరోజులుగా విస్తృత ప్రచారం జరుగుతోంది. ఆయన కొత్త పార్టీ పెడుతున్నట్టు పెద్ద ఎత్తున ఊహాగానాలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలోనే అన్నామలై కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలవడం, ఆ తరువాత ఐదు పేజీల రాజీనామా లేఖను విడుదల చేయడం చకచకా జరిగిపోయాయి. దీంతో కొన్ని రోజులుగా అన్నామలై బీజేపీకి రాజీనామా చేస్తారంటూ జరుగుతున్న ప్రచారానికి తెరపడింది. అనుకున్నట్టుగానే ఆయనబీజేపీకి రాజీనామా చేయడంతోపాటు కొత్త పార్టీ పెట్టేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు ఆయన సన్నిహితులు వెల్లడించారు. ఈ క్రమంలోనేతమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు.ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం తమిళనాట సంచలనం సృష్టిస్తున్నాయి. తాజాగా స్పందించిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నైనార్ నాగేంద్రన్ అన్నామలై బీజేపీకి రాజీనామా చేయలేదని స్పష్టం చేశారు. ఆయనరాజీనామా చేస్తున్నారంటూ జరుగుతున్న ప్రచారం అవాస్తవమని ఆయన పేర్కొన్నారు. రాజీనామా వార్తలను ఆయన కొట్టిపడేశారు.
ఆధారాలు లేవంటూ నాగ్రేందన్ వ్యాఖ్య..
అన్నామలై బీజేపీకి రాజీనామా చేస్తున్నట్టు జరుగుతున్న ప్రచారంపై స్పందించిన నాగేంద్రన్.. అవన్నీ కేవలం పుకార్లుఅని స్పష్టం చేశారు. అన్నామలైబీజేపీని వీడుతున్నట్టు వస్తున్న వార్తలు కేవలం ఆధారాలు లేని పుకార్లుగా అభివర్ణించారు.తమ ఇద్దరి మధ్య విభేదాలు లేవన్న ఆయన.. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా తనకు ఆయన నుంచి ఎలాంటి రాజీనామా లేఖ అందలేదన్నారు.తమ మధ్య మనస్పర్థలు కూడా లేవని ఆయన తేల్చి చెప్పారు. కొత్త పార్టీ పెట్టే విషయంపై అన్నామలై ఎవరితోనూ మాట్లాడలేదన్న ఆయన.. తాము కూడా ఆయనతో ఈ విషయం గురించి మాట్లాడలేదని వివరించారు. ఆయన కూడా మాతో ప్రస్తావించలేదని స్పష్టం చేశారు. ఆయనరాజీనామా చేశారంటూ వస్తున్న వార్తలు అవాస్తవమని స్పష్టం చేశారు. వాటిలో ఎలాంటి నిజం లేదన్న నాగేంద్రన్.. అవన్నీ కేవలం వందంతులని కొట్టిపారేశారు. ఇప్పుడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు చేసిన వ్యాఖ్యలు తమిళనాట ఆసక్తికరంగా మారాయి. ఐదు పేజీలు రాజీనామా లేఖను అన్నామలై విడుదల చేసినప్పటికీ కాదు అంటూ ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు చెబుతుండడం ప్రాధాన్యతను సంతరించుకుంది. దీంతో అన్నామలైరాజీనామానుబీజేపీ ఆమోదించే అవకాశం లేదని తెలుస్తోంది. అదే జరిగితే అన్నామలై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో అన్నది ఆసక్తిగా మారింది.