Homeతెలంగాణహైదరాబాద్ లో ముత్యాలు - I పేరుతో ఆర్ట్ క్యాంప్‌

హైదరాబాద్ లో ముత్యాలు – I పేరుతో ఆర్ట్ క్యాంప్‌

క్రైమ్ మిర్రర్, హైదరాబాద్: స్టేట్ ఆర్ట్ గ్యాలరీ, మాదాపూర్ హైదరాబాద్ 24 నుండి 26 జనవరి 2026 వరకు 40 మంది కళాకారులతో ‘హైదరాబాద్ పెరల్స్ -I (హైదరాబాద్ ముత్యాలు – I) ‘ పేరుతో ఆర్ట్ క్యాంప్‌ను నిర్వహిస్తోంది. ఈ కళా శిబిరాన్ని హైదరాబాద్ ఆర్ట్ సొసైటీ అధ్యక్షుడు మరియు ఆర్ట్ క్యాంపు క్యూరేటర్ అయిన ప్రముఖ శిల్పి M. V. రమణా రెడ్డి ప్రారంభించారు.

హైదరాబాద్ లో ముత్యాలు - I పేరుతో ఆర్ట్ క్యాంప్‌
హైదరాబాద్ లో ముత్యాలు – I పేరుతో ఆర్ట్ క్యాంప్‌

సభికులనుద్దేశించి ఆయన మాట్లాడుతూ హైదరాబాద్ నగరం కళాకారులను, కళాభిమానులను ఎంతో ఆకర్షిస్తుందని, ఇంకా ఎన్నో కళా కార్యక్రమాలు, కల శిబిరాలు నిర్వహించాల్సిన అవసరం ఉందని అన్నారు. స్టేట్ ఆర్ట్ గ్యాలరీ వివిధ కళా కార్యక్రమాల నిర్వహణ ద్వారా కళాకారులకు వేదిక కల్పిస్తుందని అభినందించారు. డాక్టర్ కే. లక్ష్మి ఐఏఎస్, డైరెక్టర్ స్టేట్ ఆర్ట్ గేలరీ, ఆర్ట్ క్యాంపు సందర్శించి కళాకారులను కొనియాడారు.

సీనియర్ కళాకారులు డి.అనంతయ్య, ఎస్.కాంతారెడ్డి, ముప్పిడి విట్టల్, కప్పరి కిషన్, అన్నారపు నరేందర్, అప్పం రాఘవ, శ్రీకాంత్ బాబు తదితరుల కళాకారులూ పాల్గొన్నారు. ఈ ఆర్ట్ క్యాంపు ఉదయం 11 గంటల నుండి సాయంత్రం 5 గంటలవరకు నడుస్తుంది. ఈ కళా శిబిరంలో వేసిన పెయింటింగ్ లు 27 జనవరి 2026 నాడు ఎక్సిబిషన్ నిర్వహిస్తారు.

Anji Peraboina
Anji Peraboinahttp://www.crimemirror.com
పేరబోయిన ఆంజనేయులు ప్రస్తుతం క్రైమ్ మిర్రర్ తెలుగు దినపత్రికలో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు. తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాల అప్డేట్లు, మౌలిక సదుపాయాల అభివృద్ధి, రాజకీయ పరిణామాలు మరియు ప్రత్యేక కథనాలను సమగ్రంగా అందిస్తున్నారు. జర్నలిజం రంగంలో 7 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన ఆయన, గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో రాష్ట్ర వార్తలు మరియు రాజకీయ విశ్లేషణలు రాశారు. క్షేత్రస్థాయిలో రాజకీయ సర్వేల్లో పాల్గొన్న అనుభవంతో పాటు, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ మరియు పరిశోధనాత్మక జర్నలిజంలో ప్రత్యేక నైపుణ్యం సంపాదించారు. తెలంగాణ రాజకీయ పరిణామాలపై లోతైన అవగాహనతో పాటు, ప్రజలకు నమ్మకమైన సమాచారం అందించడంలో అంజి కృషి కొనసాగుతోంది. తన ప్రతిభకు గుర్తింపుగా, 2025 ఆగస్టులో ఉత్తమ పనితీరు కోసం జర్నలిస్టు అవార్డు అందుకున్నారు.

తాజావార్తలు