Homeతెలంగాణకేబినెట్ సమావేశం: నేడు 10 కీలక బిల్లులకు ఆమోదం..!

కేబినెట్ సమావేశం: నేడు 10 కీలక బిల్లులకు ఆమోదం..!

  • క్యాబ్ డ్రైవర్లు, ఫుడ్ డెలివరీ బాయ్స్ కు ఊరట..

  • వృద్ధులైన తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తే వేతనంలో 10% కోత..

క్రైమ్ మిర్రర్, తెలంగాణ స్టేట్ బ్యూరో: తెలంగాణ ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి అధ్యక్షతన తెలంగాణ కేబినెట్ సమావేశం సచివాలయంలో సాయంత్రం 5 గంటలకు జరగనుంది. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో జరుగుతున్న ఈ భేటీలో “గిగ్ వర్కర్ల” బిల్లుతో పాటు సుమారు 10 కీలక బిల్లులకు ఆమోదం తెలిపే అవకాశం ఉంది.

గిగ్ వర్కర్ల బిల్లు 2025: క్యాబ్ డ్రైవర్లు, ఫుడ్ డెలివరీ బాయ్స్ వంటి సుమారు 3-4 లక్షల మంది అసంఘటిత రంగ కార్మికులకు సామాజిక భద్రత కల్పించడం ఈ బిల్లు ప్రధాన లక్ష్యం. ఈ చట్టం అమలైతే సమగ్ర గిగ్ వర్కర్ల చట్టం తెచ్చిన తొలి రాష్ట్రంగా తెలంగాణ నిలుస్తుంది.

తల్లిదండ్రుల సంరక్షణ – వేతన కోత: వృద్ధులైన తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేసే ప్రభుత్వ ఉద్యోగుల వేతనంలో 10% కోత విధించే వినూత్న ప్రతిపాదనను కూడా కేబినెట్ పరిశీలించే అవకాశం ఉంది.

బడ్జెట్ పథకాలు: ఇటీవల ప్రవేశపెట్టిన రూ. 3.24 లక్షల కోట్ల బడ్జెట్‌లోని కొత్త పథకాల అమలు తీరుపై కూడా ఈ సమావేశంలో చర్చించనున్నారు.

ముఖ్యమైన నిబంధనలు: గిగ్ వర్కర్ల కోసం ప్రత్యేక సంక్షేమ బోర్డు ఏర్పాటు, అగ్రిగేటర్ల నుంచి 1-2 శాతం వాటాతో సంక్షేమ నిధి సేకరణ, మరియు కారణం లేకుండా ఉద్యోగాల నుంచి తొలగించకుండా నోటీసు పీరియడ్ వంటి అంశాలు బిల్లులో ఉండనున్నాయి.

Anji Peraboina
Anji Peraboinahttp://www.crimemirror.com
పేరబోయిన ఆంజనేయులు ప్రస్తుతం క్రైమ్ మిర్రర్ తెలుగు దినపత్రికలో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు. తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాల అప్డేట్లు, మౌలిక సదుపాయాల అభివృద్ధి, రాజకీయ పరిణామాలు మరియు ప్రత్యేక కథనాలను సమగ్రంగా అందిస్తున్నారు. జర్నలిజం రంగంలో 7 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన ఆయన, గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో రాష్ట్ర వార్తలు మరియు రాజకీయ విశ్లేషణలు రాశారు. క్షేత్రస్థాయిలో రాజకీయ సర్వేల్లో పాల్గొన్న అనుభవంతో పాటు, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ మరియు పరిశోధనాత్మక జర్నలిజంలో ప్రత్యేక నైపుణ్యం సంపాదించారు. తెలంగాణ రాజకీయ పరిణామాలపై లోతైన అవగాహనతో పాటు, ప్రజలకు నమ్మకమైన సమాచారం అందించడంలో అంజి కృషి కొనసాగుతోంది. తన ప్రతిభకు గుర్తింపుగా, 2025 ఆగస్టులో ఉత్తమ పనితీరు కోసం జర్నలిస్టు అవార్డు అందుకున్నారు.

తాజావార్తలు