Wednesday, February 25, 2026
HomeజాతీయంTamil Nadu Elections: ప్రతి ఫ్యామిలీకి రూ.10 వేల ఆర్థిక సాయం, అన్నాడీఎంకే హామీల జల్లు!

Tamil Nadu Elections: ప్రతి ఫ్యామిలీకి రూ.10 వేల ఆర్థిక సాయం, అన్నాడీఎంకే హామీల జల్లు!

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా అన్నాడీఎంకే హామీల వర్షం కురిపించింది. నేరుగా ఆర్థిక సాయం, సబ్సిడీల పెంపు, రుణాల మాఫీ, నిరుద్యోగులు, మత్స్యకారులు, చేనేత కార్మికులు, చిరు వ్యాపారాలను ఆదుకోవడం వంటి కీలక హామీలను అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి కె.పళనిస్వామి ప్రకటించారు.

ఎన్నికల వేళ అన్నాడీఎంకే హామీల వర్షం

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా అన్నాడీఎంకే హామీల వర్షం కురిపించింది. నేరుగా ఆర్థిక సాయం, సబ్సిడీల పెంపు, రుణాల మాఫీ, నిరుద్యోగులు, మత్స్యకారులు, చేనేత కార్మికులు, చిరు వ్యాపారాలను ఆదుకోవడం వంటి కీలక హామీలను అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి కె.పళనిస్వామి ప్రకటించారు.

ప్రతి కుటుంబానికి రూ. 10 వేలు సాయం

రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి రూ.10 వేలు ఆర్థిక సాయం అందిస్తామని, ఎప్లాంయిమెంట్ ఎక్స్ఛేంజ్‌లో పేరు నమోదు చేసుకుని ఉద్యోగం కోసం వేచిచూస్తున్న వారికి నెలవారీ సాయంగా రూ.2,000 చొప్పున ఇస్తామని చెప్పారు. హైయర్ సెకండరీ వరకూ చదివి ఎంప్లాయిమెంట్ ఎక్స్చేంజ్‌లో పేరు నమోదు చేసుకున్న వారికి రూ.1,000 చొప్పున నెలవారీ సాయం అందిస్తామని పళనిస్వామి తెలిపారు.

మత్స్యకారులకు సాయం పెంపు

ఏటా చేపలవేటపై నిషేధం ఉన్న కాలంలో మత్స్యకారులకు ఇచ్చే సాయాన్ని రూ.8,000 నుంచి రూ.12,000కు పెంచుతామని పళనిస్వామి ప్రకటించారు. దీనితో పాటు ఏటా పొంగల్‌కు ఇచ్చే గిఫ్ట్ హ్యాంపర్‌‌‌కు అదనంగా మరో వెయ్యి రూపాయలు ఇస్తామని తెలిపారు. చేనేత కార్మికులకు ఉచిత విద్యుత్ సౌకర్యాన్ని 300 యూనిట్ల నుంచి 450 యూనిట్లకు పెంచుతామని, పవర్ లూమ్ నేత కార్మికులకు ఉచిత విద్యుత్ పరిమితిని 1,000 యూనిట్ల నుంచి 1,400 యూనిట్లకు పెంచుతామని హామీ ఇచ్చారు. పట్టణ ప్రాంతాల్లో పేమ్‌మెంట్ల మీద వ్యాపారాలు చేసుకునే చిరువ్యాపారులు సహకార బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలను మాఫీ చేస్తామని ప్రకటించారు.

Anjibabu Chittimalla
Anjibabu Chittimallahttps://crimemirror.com/
గత 16 సంవత్సరాలుగా మీడియా రంగంలో పని చేస్తున్నాను. ABN ఆంధ్రజ్యోతి, టీ-న్యూస్‌, వెలుగు దినపత్రిక, V6 చానెల్ లో జర్నలిస్టుగా పని చేశాను. 2022 నుంచి 2024 వరకు ‘ABP దేశం’కు ఫ్రీలాన్స్ జర్నలిస్టుగా పని చేశాను. BIG TVకి ఫ్రీలాన్స్ జర్నలిస్టుగా ట్రావెల్, వైరల్, లైఫ్ స్టైల్, టెక్ అండ్ సైన్స్, ఆటో, క్రైమ్ వార్తలు అందించాను. ప్రస్తుతం ‘క్రైమ్ మిర్రర్’కు డిప్యూటీ ఎడిటర్ ఇన్ చీఫ్ గా విధులు నిర్వహిస్తున్నాను.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments