Homeక్రైమ్శుభకార్యం ఇంట్లో మృత్యుఘోష.. విద్యుత్ షాక్‌తో ఇద్దరు దుర్మరణం

శుభకార్యం ఇంట్లో మృత్యుఘోష.. విద్యుత్ షాక్‌తో ఇద్దరు దుర్మరణం

క్రైమ్ మిర్రర్ : శుభకార్యం కోసం టెంట్ ఏర్పాటు చేస్తుండగా జరిగిన ఘోర ప్రమాదం ఇద్దరి ప్రాణాలను బలిగొంది. ప్రమాదవశాత్తు టెంట్‌కు సంబంధించిన ఇనుప రాడ్ 11 కేవీ హైటెన్షన్ విద్యుత్ తీగలకు తగలడంతో ఇద్దరు విద్యుత్ షాక్‌కు గురై మృతిచెందారు. మృతుల్లో 16 ఏళ్ల బాలుడు కూడా ఉండటంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఈ విషాద ఘటన ఎల్లంపేట గ్రామంలో చోటుచేసుకుంది.

స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎల్లంపేట గ్రామానికి చెందిన తుడుం శ్రీకాంత్ ఇంట్లో 21వ రోజు వేడుక (బారసాల) నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందులో భాగంగా ఇంటి వద్ద టెంట్ వేస్తున్నారు. ఈ క్రమంలో టెంట్‌కు సంబంధించిన పొడవైన ఇనుప రాడును పైకి ఎత్తుతుండగా అది అనుకోకుండా పైనున్న 11 కేవీ హైటెన్షన్ విద్యుత్ తీగలకు తగిలింది.

దీంతో ఇనుప రాడ్‌కు విద్యుత్ సరఫరా కావడంతో అక్కడే పనులు చేస్తున్న గడ్డం దేవేందర్ (47), లంబాడి హర్షిత్ బాబు (16) తీవ్ర విద్యుత్ షాక్‌కు గురై కిందపడిపోయారు. ఈ ప్రమాదాన్ని గమనించిన స్థానికులు, కుటుంబ సభ్యులు వెంటనే స్పందించి వారిని చికిత్స నిమిత్తం మెడినోవ మల్టీస్పెషాలిటీ ఆస్పత్రికి తరలించారు. అయితే ఆస్పత్రికి చేరుకునేలోపే ఇద్దరూ ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు నిర్ధారించారు.

శుభకార్యం ఇంట్లో విషాదం

మృతుల్లో 16 ఏళ్ల హర్షిత్ బాబు సిద్దిపేట జిల్లా ములుగు మండలం కొత్తూరు గ్రామానికి చెందినవాడిగా గుర్తించారు. శుభకార్యానికి సంబంధించిన ఏర్పాట్లలో ఉండగా ఈ ప్రమాదం జరగడంతో అక్కడి వాతావరణం ఒక్కసారిగా విషాదంగా మారింది. ఇద్దరి మృతితో కుటుంబ సభ్యులు, బంధువుల రోదనలు మిన్నంటాయి. సమాచారం అందుకున్న సబ్‌ఇన్‌స్పెక్టర్ భానుచందర్ ఘటనా స్థలానికి చేరుకుని ప్రమాద వివరాలను సేకరించారు. అనంతరం మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
also read : పొలం దున్నుతుండగా ట్రాక్టర్ బోల్తా.. యువ రైతు దుర్మరణం

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు