Homeక్రైమ్ఛత్తీస్‌గఢ్‌లో బీజేపీ ఎంపీ లక్ష్మీ వర్మ కారుకు ప్రమాదం.. నలుగురికి గాయాలు!

ఛత్తీస్‌గఢ్‌లో బీజేపీ ఎంపీ లక్ష్మీ వర్మ కారుకు ప్రమాదం.. నలుగురికి గాయాలు!

ఛత్తీస్‌గఢ్‌లో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బీజేపీ రాజ్యసభ ఎంపీ లక్ష్మీ వర్మ ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో ఎంపీతో పాటు మరో ముగ్గురు గాయపడటంతో రాజకీయ వర్గాల్లో కలకలం రేగింది.

వివరాల్లోకి వెళ్తే.. శుక్రవారం బలోదా బజార్ నుంచి రాజధాని రాయ్‌పూర్‌కు లక్ష్మీ వర్మ కారులో బయలుదేరారు. ఈ క్రమంలో ఖరోరా పోలీస్ స్టేషన్ పరిధిలోని బంగోలి గ్రామ సమీపంలో ఆమె ప్రయాణిస్తున్న వాహనం ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో లక్ష్మీ వర్మతో పాటు కారు డ్రైవర్, భద్రతా సిబ్బంది అధికారి, పర్సనల్ అసిస్టెంట్ గాయపడ్డారు.

ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను చికిత్స నిమిత్తం రాయ్‌పూర్‌లోని ఎయిమ్స్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారికి వైద్య చికిత్స అందిస్తున్నారు.

మరోవైపు ఈ ప్రమాదానికి అతి వేగమే కారణమై ఉండొచ్చని పోలీసులు ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. ఘటనపై పూర్తిస్థాయి వివరాలు సేకరిస్తూ దర్యాప్తు కొనసాగిస్తున్నారు. బీజేపీ ఎంపీ కారు ప్రమాదానికి గురైన విషయం తెలియడంతో ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయి కూడా స్పందించారు. క్షతగాత్రుల ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు.

also read: ఓయో హోటల్‌లో గుంటూరు యువకుడు మృతి.. వీడియో సందేశం వెనుక అసలేం జరిగింది?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు