Homeతెలంగాణకేసీఆర్ ఆమరణ దీక్షపై ఆసక్తికర డాక్యుమెంటరీ.. ‘నాట్ ఎ మహాత్మా’ ట్రైలర్ విడుదల!

కేసీఆర్ ఆమరణ దీక్షపై ఆసక్తికర డాక్యుమెంటరీ.. ‘నాట్ ఎ మహాత్మా’ ట్రైలర్ విడుదల!

తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో అత్యంత కీలకమైన ఘట్టాల్లో ఒకటైన కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష ఇప్పుడు మరోసారి తెరపైకి రాబోతోంది. 2009లో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం అప్పటి టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేపట్టిన నిరాహార దీక్షకు సంబంధించిన పరిణామాలను ఆధారంగా చేసుకుని ‘నాట్ ఎ మహాత్మా’ పేరుతో ఓ డాక్యుమెంటరీ వెబ్ సిరీస్ రూపొందుతోంది. తాజాగా ఈ సిరీస్ ట్రైలర్ విడుదల కావడంతో రాజకీయ వర్గాల్లోనే కాకుండా ప్రేక్షకుల్లోనూ ఆసక్తి పెరిగింది.

కేసీఆర్ నిరాహార దీక్షకు దారితీసిన పరిస్థితులు ఏమిటి? అప్పటి రాజకీయ వాతావరణం ఎలా ఉంది? ఆయన దీక్ష తెలంగాణ ఉద్యమాన్ని ఏ విధంగా ప్రభావితం చేసింది? ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు దారితీసిన పరిణామాల్లో ఈ పోరాటం ఎలాంటి పాత్ర పోషించింది? అనే అంశాలను ఈ డాక్యుమెంటరీలో ప్రధానంగా చర్చించనున్నట్లు ట్రైలర్ ద్వారా తెలుస్తోంది.

మొత్తం నాలుగు ఎపిసోడ్లతో ఈ సిరీస్‌ను రూపొందించారు. తెలంగాణ ఉద్యమంలో చోటుచేసుకున్న కీలక పరిణామాలు, అప్పటి రాజకీయ నాయకుల వ్యూహాలు, ఆమరణ దీక్ష చుట్టూ జరిగిన సంఘటనలను ఇందులో విశ్లేషణాత్మకంగా చూపించనున్నట్లు సమాచారం. కేవలం ఉద్యమ ఘట్టాలను గుర్తుచేయడమే కాకుండా, వాటి వెనుక ఉన్న రాజకీయ నేపథ్యాన్ని కూడా ప్రేక్షకులకు పరిచయం చేయనున్నారు.

‘ఓయ్’ సినిమాతో దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆనంద్ రంగ ఈ డాక్యుమెంటరీకి దర్శకత్వం వహించారు. ‘అనగనగా ఫిల్మ్ కంపెనీ’ పతాకంపై పట్టాభి ఆర్. చిలుకూరి నిర్మిస్తున్నారు. ముత్యాల సుధీర్ రెడ్డి సహ-దర్శకుడిగా వ్యవహరించారు.

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి ముందు సాగిన ఉద్యమ ప్రయాణంలో 2009 నాటి ఆమరణ దీక్షకు ప్రత్యేక స్థానం ఉంది. ఆ కీలక ఘట్టాన్ని ఇప్పటి తరానికి పరిచయం చేయడంతో పాటు, అప్పటి పరిణామాలను మరోసారి చర్చలోకి తీసుకొచ్చే ప్రయత్నమే ‘నాట్ ఎ మహాత్మా’. ఈ డాక్యుమెంటరీలో చరిత్రను ఏ కోణంలో ఆవిష్కరించారో తెలుసుకోవాలంటే సిరీస్ విడుదల కోసం ఎదురుచూడాల్సిందే.

also read: కేసీఆర్ ఆమరణ దీక్ష వెనుక కథేంటి? ‘నాట్ ఎ మహాత్మా’ పేరుతో డాక్యుమెంటరీ వెబ్ సిరీస్.. ట్రైలర్ విడుదల!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు