Homeక్రైమ్దాబాలో భోజనం చేస్తుండగా కాల్పులు.. నలుగురు యువకులు మృతి

దాబాలో భోజనం చేస్తుండగా కాల్పులు.. నలుగురు యువకులు మృతి

క్రైమ్ మిర్రర్ : హర్యానాలోని రోహ్‌తక్ జిల్లాలో గ్యాంగ్‌వార్ మరోసారి తీవ్ర కలకలం సృష్టించింది. ఖరావడ్ గ్రామ సమీపంలోని మిలన్ దాబాలో గురువారం తెల్లవారుజామున దారుణ ఘటన చోటుచేసుకుంది. దాబాలో భోజనం చేస్తున్న నలుగురు యువకులపై గుర్తుతెలియని దుండగులు ఒక్కసారిగా కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో నలుగురూ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. కాల్పుల శబ్దాలతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు.

ఈ ఘటన జరిగిన ప్రదేశానికి కేవలం 500 మీటర్ల దూరంలోనే ఖరావడ్ పోలీస్‌చౌకీ ఉండటం గమనార్హం. పోలీస్‌చౌకీకి ఇంత సమీపంలోనే నలుగురు హత్యకు గురికావడం స్థానికంగా భద్రతపై ఆందోళనలు పెంచింది. కాల్పుల అనంతరం నిందితులు ముంబై వైపు పారిపోయినట్లు సమాచారం. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని ఆధారాలు సేకరించారు. ప్రాథమిక దర్యాప్తులో భాగంగా హిమాంశు, సన్నీ రిటోలియా గ్యాంగ్‌ల మధ్య ఉన్న పాత కక్షలే ఈ హత్యలకు కారణమై ఉండవచ్చని అనుమానిస్తున్నారు.

మృతులను రింకు, వినీత్, గంజు, హిమాన్షుగా గుర్తించారు. వీరిలో ముగ్గురు ఝజ్జర్ జిల్లాలోని డీఘల్ గ్రామానికి చెందినవారిగా పోలీసులు గుర్తించారు. అయితే ఈ హత్యల వెనుక అసలు కారణం ఏమిటి? దాడికి పాల్పడినవారు ఎవరు? అనే విషయాలు ఇంకా స్పష్టతకు రాలేదు. నిందితుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టడంతో పాటు, గ్యాంగ్‌ల మధ్య ఉన్న విభేదాలు, ఇతర కోణాల్లోనూ దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
also read : పంజాబ్ లో ఎన్డీఏ…!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు