Homeతెలంగాణముఖ్యమంత్రి ప్రేమ కథ...!

ముఖ్యమంత్రి ప్రేమ కథ…!

  • ప్రేమించిన యువతి కోసం 1750 కిలోమీటర్ల బైక్ ప్రయాణం

  • ఢిల్లీకి వెళ్లి మరి వివాహ ప్రయత్నం

  • రేవంత్ లవ్ స్టోరీ లో గట్టి పోరాటం

క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సీఎం రేవంత్ పొలిటికల్ జర్నీ ఒక సంచలనమే. డేరింగ్ అండ్ డైనమిక్ తో ఆయన రాణించిన తీరు యువ నాయకత్వానికి ఆదర్శమే. కొడంగల్ ఎమ్మెల్యే గా ఉన్నప్పుడు.. అంతకుముందు ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు.. ప్రతి సందర్భంలోనూ రేవంత్ రెడ్డి తనదైన మేనరిజాన్ని చూపించారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా అదే దూకుడుతో వ్యవహరిస్తున్నారు. ప్రత్యర్థుల మీద విమర్శలు చేయడంలో, రాజకీయ వ్యూహాలు రచించడంలో రేవంత్ రెడ్డి శైలి ఎప్పటికీ ప్రత్యేకమే. ఒక రాజకీయ నాయకుడిగా రేవంత్ రెడ్డి తాను అనుకున్న లక్ష్యాలను సాధించారు. అనతి కాలంలోనే తెలంగాణ ముఖ్యమంత్రి అయ్యారు. అయితే ఆ యంగ్ డైనమిక్ లీడర్ పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే.. బయట ప్రపంచానికి పెద్దగా తెలియదు. ముఖ్యంగా ఆయన ప్రేమ కథ ఉందన్న విషయం బయటకు రాలేదు కూడా. కానీ తొలిసారిగా ఆ విషయాన్ని బయటపెట్టారు సీఎం రేవంత్.

జరిగింది ఇది…

రేవంత్ రెడ్డి ప్రేమ వివాహం. ఆయన భార్య పేరు గీత. ఇంటర్ చదివే రోజుల్లోనే రేవంత్ ఆమెను ప్రేమించారు. అప్పట్లో ఒకసారి నాగార్జునసాగర్ కు వెళ్ళినప్పుడు వారిద్దరి మధ్య పరిచయం మొదలైంది. ఆ స్నేహం కాస్త ప్రేమగా రూపాంతరం చెందింది. రేవంత్ రెడ్డి ముందుగా గీతకు తన ప్రేమను వ్యక్తం చేశారు. ఆయన ధైర్యాన్ని చూసి.. వ్యక్తిత్వాన్ని ఇష్టపడి.. ముక్కు సూటితనాన్ని నచ్చి రేవంత్ రెడ్డికి గీత గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

పెద్దల అభ్యంతరం…

అన్ని ప్రేమ కథల్లో మాదిరిగానే రేవంత్ రెడ్డి ప్రేమ కథలు కుటుంబాల నుంచి అడ్డంకులు ఎదురయ్యాయి. అప్పటికి ఇంకా రేవంత్ రాజకీయాల్లోకి రాలేదు. ముందుగా గీత కుటుంబ సభ్యులు ఈ వివాహానికి అంగీకరించలేదు. ఉన్నత చదువుల నిమిత్తం గీతను ఢిల్లీలో ఉంటున్న ఆమె బాబాయి.. కేంద్రమంత్రి జైపాల్ రెడ్డి వద్దకు పంపించారు. అయినా రేవంత్ రెడ్డి ఎక్కడ వెనక్కి తగ్గలేదు. తన ప్రేమను పెళ్లి దాకా తీసుకెళ్లాలని భావించారు. అందుకే ఏకంగా ఆయన బైక్ పై ఢిల్లీ వెళ్లారు. ఒకటి కాదు రెండు కాదు సుమారు 1750 కిలోమీటర్ల దూరం బైక్ పై ప్రయాణం చేశారు. రైలు లేదా విమానంలో వెళ్లే అవకాశం ఉన్నప్పటికీ రేవంత్ రెడ్డి బైక్ మీద ప్రయాణం చేయడం అతనిలో ఉన్న పట్టుదలకు నిదర్శనం. అయితే అప్పట్లో రేవంత్ నేరుగా జైపాల్ రెడ్డితోనే మాట్లాడారు. తన ప్రేమ విషయాన్ని బయటపెట్టారు. పెళ్లికి ఒప్పుకునే విధంగా ఆయనను ఒప్పించారు. రేవంత్ రెడ్డిలో ధైర్యం, ఆత్మవిశ్వాసం, మాటతీరు జయపాల్ రెడ్డి ని ఆకట్టుకున్నాయి. దీంతో జైపాల్ రెడ్డి గీత తండ్రిని ఒప్పించారు. దీంతో ఇరు కుటుంబాల పరస్పర అంగీకారం మేరకు 1992 మే 7న రేవంత్ రెడ్డి, గీతా వివాహ బంధం ద్వారా ఒక్కటయ్యారు.

ఆ ప్రదేశాన్ని సందర్శించి…

ఇటీవల నాగార్జునసాగర్ లో వరుణ యాగం జరిగింది. రేవంత్ దంపతులు హాజరయ్యారు. తన సతీమణి గీతతో కలిసి అక్కడకు వెళ్లారు. తమ ప్రేమకు తొలి అడుగు పడిన ప్రాంతాన్ని సందర్శించారు. నాటి జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. అప్పటి పాత ఫోటోలు కూడా ఆయన సోషల్ మీడియాలో పంచుకున్నారు. ప్రేమ కోసం 1750 కిలోమీటర్ల దూరం బైక్ మీద ప్రయాణించడం ఒక గొప్ప సాహసమే. రేవంత్ రాజకీయాల్లోనే కాదు.. తన ప్రేమను సఫలం చేసుకోవడానికి గట్టి పోరాటమే చేశారని అర్థం అవుతోంది.

ఇవి కూడ చ‌ద‌వండి:
  1. కరీంనగర్ గడ్డపై బండి సంజయ్ గర్జన.. జైశ్రీరామ్’ నినాదంతో హోరెత్తిన సభ!
  2.  ఆర్సీబీ నమ్మకాన్ని నిలబెట్టుకుంటా.. యశ్ దయాళ్ ఆసక్తికర వ్యాఖ్యలు!
  3. బియ్యం ధరలపై సామాన్యులకు ఊరటనిచ్చేలా కేంద్రం కీలక యోచన
  4.  18 టెక్నాలజీ ఫార్మాట్లలో ‘వారణాసి’.. ప్రపంచ సినీ ప్రేక్షకుల కోసం రాజమౌళి భారీ ప్లాన్!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు