Homeఆంధ్ర ప్రదేశ్యలహంక ప్యాలెస్ వివాదం.. షర్మిలను అడ్డుకునేందుకు జగన్ కోర్టును ఆశ్రయించారా?

యలహంక ప్యాలెస్ వివాదం.. షర్మిలను అడ్డుకునేందుకు జగన్ కోర్టును ఆశ్రయించారా?

వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి, ఆయన సోదరి వైఎస్ షర్మిల మధ్య యలహంక ప్యాలెస్ వ్యవహారం మరోసారి చర్చనీయాంశంగా మారింది. కుటుంబ ఆస్తుల విషయంలో ఇప్పటికే కొనసాగుతున్న విభేదాలు తాజాగా కోర్టు వరకు చేరినట్లు తెలుస్తోంది. యలహంక ప్యాలెస్‌లోకి షర్మిల ప్రవేశించకుండా అడ్డుకోవాలనే ఉద్దేశంతో జగన్ న్యాయస్థానాన్ని ఆశ్రయించినట్లు సమాచారం.

ఈ వ్యవహారానికి సంబంధించి దేవనహళ్లి కోర్టులో సిలికాన్ బిల్డర్స్ లిమిటెడ్ పేరుతో పిటిషన్ దాఖలైనట్లు తెలుస్తోంది. తన కుమార్తె అంజలి వివాహ ఏర్పాట్లలో భాగంగా షర్మిల యలహంక ప్యాలెస్‌కు వెళ్లాలని భావించినట్లు సమాచారం. అయితే ఈ విషయం తెలుసుకున్న జగన్, ఆమె ప్యాలెస్‌లోకి రాకుండా అడ్డుకునేందుకు కోర్టును ఆశ్రయించినట్లు వార్తలు వెలువడ్డాయి.

మరోవైపు, జగన్ అభ్యంతరాల నేపథ్యంలోనే అంజలి వివాహ వేడుకకు సంబంధించిన వేదికను షర్మిల ఇప్పటికే మార్చుకున్నట్లు తెలుస్తోంది. దీంతో అన్నాచెల్లెళ్ల మధ్య నెలకొన్న విభేదాలు మరోసారి తెరపైకి వచ్చాయి.

కుమార్తె వివాహ వేడుక నేపథ్యంలో మొదలైన ఈ పరిణామాలు ఇప్పుడు రాజకీయ, కుటుంబ వర్గాల్లో చర్చకు దారితీస్తున్నాయి. యలహంక ప్యాలెస్ వివాదంపై న్యాయస్థానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్నది ఆసక్తికరంగా మారింది.

also read: ధురంధర్‌కు ఉత్తమ చిత్రం అవార్డు… కమల్ హాసన్‌కు ప్రత్యేక గౌరవ పురస్కారం

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు