Homeతెలంగాణవివాదంలోకి విజయా డెయిరీ...!

వివాదంలోకి విజయా డెయిరీ…!

  • చైర్మన్ తో పాటు ఐదుగురు డైరెక్టర్లపై వేటు

  • హైకోర్టు సంచలన తీర్పు

క్రైమ్ మిర్రర్, ఏపీ బ్యూరో: విజయ డైయిరీ వివాదం మళ్లీ మొదటికి వచ్చింది. కృష్ణా మిల్క్ యూనియన్ పాలకమండలి ఎన్నికల విషయంలో ఏపీ హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. చైర్మన్ దాసరి వెంకట బాలవర్ధన్ రావు తో పాటు మరో నలుగురు బోర్డు డైరెక్టర్ల ఎన్నిక చెల్లదని న్యాయస్థానం స్పష్టం చేసింది. గన్నవరం నుంచి ఎన్నికైన దాసరి బాలవర్ధన్ రావు తో పాటు గంటసాల డైరెక్టర్ సాయి, గన్నవరం డైరెక్టర్ పాలడుగుల నాని, నందిగామ డైరెక్టర్ నాగేశ్వరరావు, మైలవరం డైరెక్టర్ శైలజల ఎన్నికను సవాల్ చేస్తూ దాఖలైన పిటీషన్ల పై విచారణ చేపట్టిన హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. నిబంధనల ప్రకారం బోర్డు సమావేశం, ఎన్నికల నిర్వహణకు కనీసం 10 మంది సభ్యుల కోరం ఉండాల్సి ఉండగా.. కేవలం ఎనిమిది మంది సభ్యులతోనే ఎన్నిక నిర్వహించడానికి న్యాయస్థానం తప్పు పట్టింది. ఈ మేరకు కీలక ఆదేశాలు ఇచ్చింది.

కొద్ది నెలల కిందట…

ఏడేళ్లుగా విజయ డైరీ చైర్మన్గా కొనసాగుతున్న చలసాని ఆంజనేయులు నాటకీయ రాజీనామాతో ఈ వ్యవహారం మలుపు తిరిగింది. ఆయన రాజీనామా చేయమని హై కమాండ్ ఆదేశించినా చేయలేదు. చివరకు మంత్రులు కొల్లు రవీంద్ర, పార్థసారథి రంగంలోకి దిగి చర్చలు జరిపారు. ఆంజనేయులు అస్వస్థతకు గురై ఆస్పత్రి బెడ్ పైనుంచి తన చైర్మన్, డైరెక్టర్ పదవులకు రాజీనామా చేశారు. ఆ తర్వాత ఏర్పడిన ఖాళీలో భాగంగా గన్నవరం మాజీ ఎమ్మెల్యే దాసరి బలవర్ధన్ రావును ఏకగ్రీవ చైర్మన్గా ఎన్నుకున్నారు. అయితే ఈ డైరెక్టర్ల ఎన్నిక ప్రక్రియలోనే నిబంధనల ఉల్లంఘన జరిగిందంటూ ప్రత్యర్థి వర్గం హైకోర్టును ఆశ్రయించింది.

ఆ పిటిషన్ తో…

ఐదుగురు బోర్డు సభ్యులపై పోటీ చేసిన అభ్యర్థులను ఎన్నికల అధికారులు కావాలని డిఫాల్టర్లుగా ప్రకటించి అనర్హులుగా తేల్చారని.. తద్వారా ఏకగ్రీవ ఎన్నికలకు మార్గం సుగమం చేసుకున్నారని పిటిషనర్లు ఆరోపించారు. దీనికి తోడు బోర్డు ఏర్పాటుకు, చైర్మన్ ఎన్నికకు అవసరమైన పదిమంది సభ్యుల కోరం లేకుండా కేవలం ఎనిమిది మంది హాజరుతోనే బలవర్ధన్ రావు ఎన్నుకోవడం సహకార సంఘాల నిబంధనలకు విరుద్ధమని హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఇరువర్గాల వాదనలు విన్న న్యాయస్థానం చైర్మన్ తో సహా ఐదుగురు ఎన్నిక చల్లదని తీర్పు చెప్పింది.

సుదీర్ఘ చరిత్ర…

విజయ డైరీ కి సుదీర్ఘ చరిత్ర ఉంది. 1960లో ఇది ఏర్పాటయింది. పాడి రైతుల సంక్షేమం కోసం, నాణ్యమైన పాలు, పాల ఉత్పత్తులను ప్రజలకు అందించడానికి ఏర్పాటు చేసిన సహకార సంస్థ ఇది. సుదీర్ఘకాలం దీనికి చైర్మన్గా మండల జానకి రామయ్య వ్యవహరించారు. 27 సంవత్సరాల పాటు ఆయన పదవిలో కొనసాగారు. గత ఏడాది కన్నుమూశారు. టిడిపి కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత రాజకీయ ఒత్తిళ్లతో బలవర్ధన్ రావు చైర్మన్ గా వ్యవహరిస్తూ డైరెక్టర్ల నియామకం జరిగింది. కానీ ఇప్పుడు హైకోర్టు షాక్ ఇచ్చింది. మరి దీనిపై ఎలా ముందుకు వెళ్తుందో ప్రభుత్వం చూడాలి.

ఇవి కూడ చ‌ద‌వండి:
  1.  ఉపాధి కల్పిస్తున్నారా.. ఉసురు తీస్తున్నారా?
  2. అధికార పార్టీలోనే రాజగోపాల్ రెడ్డి సింహగర్జన!
  3. సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై కేటీఆర్ తీవ్ర ఆగ్రహం
  4.  ప్రేమ వివాహానికి నిరాకరించడంతో యువతి ఆత్మహత్య

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు