Homeతెలంగాణ' సమ్మక్క- సారక్క' ప్రాజెక్టుకు లైన్ క్లియర్...!

‘ సమ్మక్క- సారక్క’ ప్రాజెక్టుకు లైన్ క్లియర్…!

  • నిరభ్యంతర పత్రం ఇచ్చేందుకు చత్తీస్గడ్ రెడీ

  • రాయపూర్ వెళ్లి అక్కడి ముఖ్యమంత్రితో సీఎం రేవంత్ చర్చలు

క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో: సాగునీటి ప్రాజెక్టులపై ప్రత్యేకంగా దృష్టి పెట్టింది రేవంత్ సర్కార్. ములుగు జిల్లా తుపాకుల గూడెం వద్ద గోదావరి నదిపై నిర్మాణం పూర్తయిన సమ్మక్క సాగర్ బ్యారేజీలో నీటి నిల్వకు మార్గం సుగమం చేసే దిశగా తెలంగాణ ప్రభుత్వం ముందడుగు వేసింది. సీఎం రేవంత్ రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి చత్తీస్గడ్ ముఖ్యమంత్రి విష్ణు దేవ్ తో సమావేశం అయ్యారు. బ్యారేజీ నిర్మాణం పూర్తయినందున.. గోదావరి జలాలను నిల్వ చేసేందుకు వీలుగా ఛత్తీస్గడ్ ప్రభుత్వం తక్షణమే నిరభ్యంతర పత్రం జారీ చేయాలని రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో కరువు పరిస్థితుల దృష్ట్యా సాగు, తాగునీటి అవసరాలు పెరిగాయని రేవంత్ వివరించగా.. చత్తీస్గడ్ సీఎం సానుకూలంగా స్పందించారు. ఎన్వోసీ ప్రక్రియను వీలైనంత త్వరగా పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు.

ప్రతిపాదిత స్థలం మార్పు…

సమ్మక్క సారక్క ప్రాజెక్టును మొదటిగా కాంతనాపల్లి వద్ద ప్రతిపాదించారు. అక్కడ 11408 ఎకరాల భూమితో పాటు 17 ఆదివాసీ గ్రామాలు, భద్రత మౌలిక సదుపాయాలు ముంపునకు గురయ్యే అవకాశం ఉండడంతో.. బ్యారేజీ నిర్మాణాన్ని తుపాకుల గూడెంకు మార్చారు. చత్తీస్గడ్ ప్రభుత్వ అభ్యర్థన మేరకు ముంపు కోసం తెలంగాణ ప్రభుత్వం ఏప్రిల్ లో రూ.9.83 కోట్లు చెల్లించింది. జూలై 30న ఐఐటి ఖరగ్పూర్ తన నివేదికను సమర్పించింది. ఆ నివేదిక ప్రకారం పూర్తిస్థాయి నీటిమట్టం వద్ద చత్తీస్గడ్ పరిధిలో కేవలం 33 ఎకరాలు మాత్రమే గురవుతోందని.. భారీ వరదలు వచ్చినా ప్రభావిత ప్రాంతం 100 ఎకరాలకు మించదని తెలిపింది.

ముంపు సమస్యకు పరిష్కారం...

అయితే ఇప్పుడు చత్తీస్గడ్ నుంచి నిరభ్యంతర పత్రం కావాలి. ఈ బ్యారేజీ ద్వారా కరువు ప్రభావిత, వెనుకబడిన గిరిజన ప్రాంతాలకు సాగు, తాగునీటిని అందించడమే తెలంగాణ ప్రభుత్వం ప్రధాన లక్ష్యం అని రేవంత్ రెడ్డి ప్రకటించారు. ముఖ్యంగా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు రెండో దశ ఆయకట్టు స్థిరీకరణ, దేవాదుల ఎత్తిపోతల పథకం, రామప్ప పాకాల లింక్ కెనాల్ కింద లక్షలాది ఎకరాలకు ఈ ప్రాజెక్టు జీవనాడిగా మారనుంది. నిబంధనల ప్రకారం చత్తీస్గడ్ పరిధిలో భూసేకరణ, పరిహారం, పునరావాసానికి అయ్యే పూర్తి ఖర్చును భరించడానికి తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉందని ముఖ్యమంత్రి మరోసారి. ఇప్పటికే ప్రధానికి ఈ పరిస్థితిని వివరించిన సీఎం రేవంత్ స్వయంగా రాయపూర్ వెళ్లి చత్తిస్గడ్ ముఖ్యమంత్రితో చర్చలు జరపడం ప్రాధాన్యత సంతరించుకుంది.

ఇవి కూడ చ‌ద‌వండి:

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు