Homeతెలంగాణపెన్షన్ లబ్ధిదారులకు గుడ్ న్యూస్...!

పెన్షన్ లబ్ధిదారులకు గుడ్ న్యూస్…!

  • రూ. 4 వేలకు పెరగనున్న పింఛన్ మొత్తం

  • రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం

క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో: తెలంగాణలో పెన్షన్ లబ్ధిదారులకు గుడ్ న్యూస్. ఇప్పటివరకు 2000 రూపాయల పింఛన్ మొత్తం అందుతూ వస్తోంది. ఇకనుంచి అది 4 వేల రూపాయలకు పెరగనుంది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని అమలు చేసేందుకు రేవంత్ సర్కార్ సిద్ధపడుతోంది. రాష్ట్రంలో లక్షలాది మంది వృద్ధులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలు చేయూత పథకం ద్వారా ప్రతినెలా సామాజిక పెన్షన్ పొందుతున్నారు. అయితే తాము అధికారంలోకి వస్తే పెన్షన్ మొత్తాన్ని నాలుగువేల రూపాయలకు పెంచుతామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. మేనిఫెస్టోలో సైతం పొందుపరిచింది. అయితే ఇప్పుడు అధికారంలోకి వచ్చి మూడేళ్లు అవుతున్న తరుణంలో పింఛన్ మొత్తాన్ని పెంచేందుకు నిర్ణయించింది. ఇటీవల నల్గొండ జిల్లా ఏచూరి గార్డెన్స్ లో కొత్తగా మంజూరు అయిన చేయూత పెన్షన్లను పంపిణీ చేసిన సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఈ కీలక ప్రకటన చేశారు.

చేయూత పథకం కింద…

ప్రస్తుతం చేయూత పథకం కింద.. ఒక్కో లబ్ధిదారుడుకు 2000 రూపాయలు చొప్పున పెన్షన్ అందుతోంది. ఆ మొత్తాన్ని నాలుగు వేలకు పెంచేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పేద ప్రజల సంక్షేమానికి కట్టుబడి ఈ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి ప్రకటన చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో చేయూత పేరుతో రాజశేఖర్ రెడ్డి పింఛన్ మొత్తాన్ని పెంచారు. అయితే ఏపీలో మాత్రం కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే పింఛన్ మొత్తాన్ని నాలుగు వేల రూపాయలకు పెంచింది. తెలంగాణలో మాత్రం అక్కడి లబ్ధిదారులు ఎదురుచూస్తూ వచ్చారు. ఎట్టకేలకు ప్రభుత్వం దీనిపై ఒక నిర్ణయానికి వచ్చింది.

ఎన్నికలు దగ్గర పడుతుండడంతో…

కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షేమ పథకాలను అమలు చేయడం ప్రారంభించింది. ఎన్నికలు సమీపిస్తుండడంతో అభివృద్ధితోపాటు సంక్షేమంపై దృష్టి పెట్టింది. ఇప్పటికే కొత్త పింఛన్లను మంజూరు చేసింది. అయితే వృద్ధాప్య పింఛన్లను కాకుండా ఇతర పెన్షన్లను అందించింది. ఇప్పుడు ఏకంగా ఉన్న పింఛన్ మొత్తాన్ని రెట్టింపు చేసి అందించేందుకు నిర్ణయం తీసుకోవడం విశేషం. ప్రజల్లో సానుకూలత పెంచుకునేందుకు ఈ నిర్ణయం ఎంతగానో దోహదపడుతుందని ప్రభుత్వం భావిస్తోంది. చూడాలి చివరకు ఏం జరుగుతుందో..

ఇవి కూడ చ‌ద‌వండి:

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు