క్రైమ్ మిర్రర్ : అమెరికాలోని సౌత్ కరోలినా రాష్ట్రంలో హృదయవిదారక ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ వ్యక్తి తన 11 నెలల కుమారుడిని సజీవంగానే భూమిలో పాతిపెట్టినట్లు సమాచారం. అయితే, ఆ చిన్నారి దాదాపు 24 గంటల పాటు ప్రాణాలతో పోరాడి చివరకు సురక్షితంగా బయటపడ్డాడు.
వివరాల్లోకి వెళ్తే.. సౌత్ కరోలినాకు చెందిన మైకేల్ కామర్ తన 11 నెలల కుమారుడితో కలిసి కనిపించకుండా పోయాడు. దీంతో ఆందోళనకు గురైన అతని భార్య పోలీసులను ఆశ్రయించింది. ఫిర్యాదు అందుకున్న పోలీసులు తండ్రి, కుమారుడి కోసం గాలింపు చేపట్టారు. ఈ క్రమంలో మైకేల్ ఇంటి సమీపంలోని అటవీ ప్రాంతంలో ఇటీవలే మట్టితో కప్పినట్లు కనిపించిన ఓ ప్రదేశాన్ని పోలీసులు గుర్తించారు. అనుమానం రావడంతో అక్కడ తవ్వి చూడగా, తువాలులో చుట్టి కుక్కల బోనులో ఉంచి పాతిపెట్టిన చిన్నారి కనిపించాడు.
పోలీసులు వెంటనే శిశువును బయటకు తీయగా, అప్పుడే ఆ పసికందు ఏడవడం ప్రారంభించాడు. దీంతో అక్కడున్న అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. వెంటనే చిన్నారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. తన కుమారుడిని తండ్రి మైకేల్ కామరే పాతిపెట్టినట్లు పోలీసులు గుర్తించినట్లు కథనంలో పేర్కొన్నారు. దాదాపు 24 గంటల పాటు భూమిలో చిక్కుకున్నప్పటికీ చిన్నారి ప్రాణాలతో బయటపడటం ఈ ఘటనలో అందరినీ విస్మయానికి గురిచేసింది.
also read : ఢిల్లీ ఎయిర్పోర్ట్ టన్నెల్లో ఘోర ప్రమాదం.. 200 కి.మీ వేగంతో దూసుకెళ్లిన కారు.. 22 ఏళ్ల యువకుడు మృతి!
