Homeఆంధ్ర ప్రదేశ్గురుకులంలో కల‌క‌లం...! నిద్రిస్తున్న విద్యార్థినుల జ‌డ‌లు క‌త్తెరించిన ఆక‌తాయిలు...

గురుకులంలో కల‌క‌లం…! నిద్రిస్తున్న విద్యార్థినుల జ‌డ‌లు క‌త్తెరించిన ఆక‌తాయిలు…

ప‌ల్నాడు, క్రైమ్‌మిర్ర‌ర్‌: ప‌ల్నాడు జిల్లాలోని ఓ బాలిక‌ల గురుకుల పాఠ‌శాల‌లో నిద్రిస్తున్న 10 మంది విద్యార్థినుల జుట్టు క‌త్తిరించిన ఘ‌ట‌న ఆ ప్రాంతంలో ఒక్క‌సారిగా క‌ల‌క‌లం రేపుతోంది. నిద్రిస్తున్న స‌మ‌యంలో 10 మంది విద్యార్థినుల జ‌డ‌ల‌ను గుర్తు తెలియ‌ని దుండ‌గులు క‌త్తించారు. ఈ విష‌యం బ‌య‌ట‌కు రావ‌డంతో పాఠ‌శాల‌లో క‌ల‌క‌లం రేపుతోంది. వివ‌రాల ప్ర‌కారం పల్నాడు జిల్లా సత్తెనపల్లి రూరల్‌ మండలం రామకృష్ణాపురంలోని మహాత్మా జ్యోతిబా పూలే బీసీ వెల్ఫేర్‌ బాలికల గురుకుల పాఠశాలలో ఈ ఘటన జరిగింది. పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతున్న 10 మంది విద్యార్థినులు రాత్రి నిద్రిస్తున్న సమయంలో వారి జడలను ఎవరో కత్తిరించారు. ఉదయం నిద్రలేచిన తర్వాత జుట్టు కత్తిరించి ఉండటాన్ని గమనించిన బాలికలు భయాందోళనకు గురయ్యారు. ఈ విషయం బయటకు రావడంతో పాఠశాల పరిసరాల్లో కలకలం రేగింది.

త‌ల్లిదండ్రుల ఆగ్ర‌హం…

తమ పిల్లలకు భద్రత ఉంటుందనే నమ్మకంతో గురుకుల పాఠశాలలో చేర్పిస్తే ఇలాంటి ఘటన జరగడంపై విద్యార్థినుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హాస్టల్‌ ప్రాంగణంలోకి గుర్తుతెలియని వ్యక్తులు ప్రవేశించి ఉంటే రాత్రి వేళ భద్రతా సిబ్బంది, వార్డెన్‌ పర్యవేక్షణ ఏమైందని ప్రశ్నిస్తున్నారు. విద్యార్థినులు నిద్రిస్తున్న సమయంలో ఇలాంటి ఘటన ఎలా జరిగిందని నిలదీస్తున్నారు. పాఠశాల సిబ్బంది నిర్లక్ష్యం ఏమైనా ఉందా? అనే కోణంలో ఉన్నతాధికారులు విచారణ జరిపించాలని డిమాండ్‌ చేస్తున్నారు.

పాఠ‌శాల ప్ర‌ధానోపాద్యాయురాలి వివ‌ర‌ణ‌..

ఇదే విష‌య‌మై పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు రజనీకుమారిని వివరణ కోరగా.. ఇటీవల ప్రభుత్వం అందించిన స్టేషనరీ కత్తెరలతో విద్యార్థినులే ఒకరి జుట్టును మరొకరు కత్తిరించుకున్నారని ఆమె తెలిపినట్లు సమాచారం. ఈ ఘటనపై రూరల్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశామని, ఎస్సై దర్యాప్తు చేస్తున్నారని పేర్కొన్నట్లు తెలిసింది.

ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు పాఠశాలకు చేరుకుని వివరాలు సేకరించారు. విద్యార్థినులు, పాఠశాల సిబ్బందిని ప్రశ్నించడంతో పాటు పాఠశాల రికార్డులను పరిశీలించి విచారణ చేపట్టారు. బయటి వ్యక్తులు హాస్టల్‌లోకి ప్రవేశించారా? లేక పాఠశాలలో చదువుతున్న ఆకతాయి విద్యార్థులే ఈ ఘటనకు పాల్పడ్డారా? అనే కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నట్లు తెలుస్తోంది.

ఇవి కూడ చ‌ద‌వండి:

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు