Homeక్రైమ్అస్సాంలో ఘోర రైలు ప్ర‌మాదం...! ప‌లువురికి గాయాలు...

అస్సాంలో ఘోర రైలు ప్ర‌మాదం…! ప‌లువురికి గాయాలు…

అస్సాం, క్రైమ్‌మిర్ర‌ర్‌: అస్సాంలోని కామెరూప్ జిల్లా డిగార్ వ‌ద్ద కోల్‌క‌తా-సైరంగ్ ఎక్స్‌ప్రెస్ రైలు ప‌ట్టాలు త‌ప్పి ప్ర‌మాదానికి గురైంది. ఈ ప్ర‌మాదంలో ఆరు బోగీలు ప‌ట్టాలు త‌ప్పి ప‌లువురికి గాయ‌ల‌య్యాయి. ఈ ప్ర‌మాదం బుధ‌వారం తెల్ల‌వారుజామున 6.54 సంభ‌వించిన‌ట్లు రైల్వే అధికారులు పేర్కొన్నారు. దీంతో విష‌యం తెలియ‌గానే సీనియ‌ర్ అధికారులు సంఘ‌ట‌న స్థ‌లానికి చేరుకొని ప‌రిస్థితిని స‌మీక్షిస్తున్నారు.

గువాహటికి 30 కిలోమీటర్ల దూరంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రమాదంలో ఇంజిన్‌తో సహా ఆరు కోచ్‌లు పట్టాలు తప్పాయి. గువాహటి స్టేషన్‌ నుంచి బయల్దేరిన కొద్దిసేపటికే రైలు ప్రమాదానికి గురైంది. ఈ రైలు మంగళవారం ఉదయం కోల్‌కతా స్టేషన్‌ నుంచి బయల్దేరింది. ఇవాళ‌ మధ్యాహ్నానికి మిజోరంలోని సైరంగ్‌కు చేరుకోవాల్సి ఉంది. ఈ రైలు ఒక లైన్‌ నుంచి మరో లైన్‌కు మారుతున్న వేళ తలెత్తిన సాంకేతిక సమస్య కారణంగా పట్టాలు తప్పి ఉండవచ్చని అధికారులు అనుమానిస్తున్నారు

ఇవి కూడ చ‌ద‌వండి:

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు