Homeతెలంగాణవిజయసాయిరెడ్డి టార్గెట్ ఫిక్స్..! 11న కొత్త రాజకీయ పార్టీ...

విజయసాయిరెడ్డి టార్గెట్ ఫిక్స్..! 11న కొత్త రాజకీయ పార్టీ…

  • నేతల చేరికలు ప్రారంభం

  • వైసిపి తో పాటు రెడ్డి సామాజిక వర్గమే లక్ష్యం

క్రైమ్ మిర్రర్, ఏపీ బ్యూరో: కొత్త పార్టీ ఏర్పాటు దిశగా విజయసాయిరెడ్డి కీలక అడుగులు వేస్తున్నారు. ఈనెల 11న కొత్త పార్టీని ప్రకటించనున్నారు. గత కొంతకాలంగా కొత్త పార్టీ ఏర్పాటు పై ప్రకటనలు చేస్తూ వచ్చారు విజయసాయిరెడ్డి. కానీ ఎప్పటికప్పుడు వాయిదా వేస్తూ వచ్చారు. అయితే ఈసారి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అనుకున్న సమయానికి పార్టీ ఏర్పాటుపై ప్రకటన చేసేందుకు కసరత్తు మొదలుపెట్టారు. దాదాపు రెండేళ్ల కిందట వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పిన ఆయన వ్యవసాయం చేసుకుంటానని చెప్పుకొచ్చారు. కానీ తర్వాత మనసు మార్చుకుని రాజకీయ ఆసక్తి ఉందని మరోసారి బయటపెట్టారు. కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటు చేస్తానని.. అనుబంధంగా మీడియాను సైతం ఏర్పాటు చేస్తానని చెప్పినా ఆయన.. డిజిటల్ మీడియా ప్రక్రియను పూర్తి చేసి ఇప్పుడు రాజకీయ పార్టీ ఏర్పాటుపై పూర్తిస్థాయిలో దృష్టి పెట్టారు. దీంతో ఏపీలో మరో కొత్త పార్టీ ఏర్పాటు ఖాయమని తేలిపోయింది.

ఓ ఇద్దరు నేతల చేరిక…

విజయసాయిరెడ్డి ప్రకటించే కొత్త పార్టీలోకి చాలామంది నేతలు వెళ్తారని ప్రచారం నడిచింది. కానీ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు పెద్దగా మొగ్గు చూపలేదు. మరోవైపు ఆయన రెడ్డి సామాజిక వర్గాన్ని టార్గెట్ చేస్తారని ప్రచారం నడిచింది. అందుకు తగ్గట్టుగానే ఓ ఇద్దరూ నేతలు విజయసాయిరెడ్డి తో కలిసి పని చేసేందుకు ముందుకు వచ్చారు. విశ్వహిందూ పరిషత్ నాయకురాలు సుమతి రెడ్డి, హిందూ షెడ్యూల్ కులాల పరిరక్షణ సమితి నేత బోని గణేష్ విజయసాయిరెడ్డి పార్టీలో కలిసేందుకు.. ఆయనతో కలిసి పని చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా సుమతి రెడ్డి మాట్లాడుతూ సాయి రెడ్డి తోనే హక్కుల పరిరక్షణ సాధ్యం అని చెప్పుకొచ్చారు. గణేష్ మాట్లాడుతూ ఎస్సి- హిందువుల హక్కులను పరిరక్షించాలని పిలుపునిచ్చారు. తాము హిందూ ఎస్సీలమని పేర్కొన్నారు.

ప్రత్యేక అజెండాతో…

ఈ నేతల చేరికతో విజయసాయిరెడ్డి కొత్త పార్టీ అజెండా స్పష్టంగా తెలియజేస్తోంది. హిందూ అజెండాతో.. రెడ్డి సామాజిక వర్గాన్ని టార్గెట్ చేసుకున్నట్లు స్పష్టమవుతుంది. మరోవైపు విజయసాయిరెడ్డి జగన్మోహన్ రెడ్డిని మరోసారి టార్గెట్ చేసుకున్నారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో తనను పొమ్మన లేక పొగ పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నెన్నో అవమానాలను ఎదుర్కొని బయటకు వచ్చేసానని చెప్పారు. హిందూ అజెండాతో పాటు రెడ్డి సామాజిక వర్గం నేతలే విజయసాయిరెడ్డి ఆశ్రయిస్తుండడం గమనార్హం.

 

ఇవి కూడ చ‌ద‌వండి:
  1.  తల్లి మృతదేహం వద్దే రాత్రంతా రోదించిన మూడేళ్ల బాలుడు.. ఉరివేసుకుని మహిళ ఆత్మహత్య 
  2.  ఏపీలో ఇక కాంగ్రెస్…!
  3.  బీహార్‌లో దారుణం.. యువతిని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి అఘాయిత్యం!
  4.  ప్రేమ పేరుతో వేధింపులు.. ప్రపోజల్ తిరస్కరించిందని డిగ్రీ విద్యార్థినిపై లైంగిక దాడి!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు