Homeజాతీయంఅమెరికా అధ్యక్షు రేసు నుంచి వివేక్ రామస్వామి ఔట్...!

అమెరికా అధ్యక్షు రేసు నుంచి వివేక్ రామస్వామి ఔట్…!

  • ఓహియో గవర్నర్ ఎన్నికల్లో పరాభవం

  • కొంపముంచిన ట్రంప్ విధానాలు

  • వైట్ హౌస్ రేసులో చాలా కష్టం

క్రైమ్ మిర్రర్, సెంట్రల్ డెస్క్ : అమెరికా రాజకీయాల్లో కీలక పరిణామం. మిడ్ టర్మ్ ఎన్నికల్లో ప్రస్తుత అధ్యక్షుడు ట్రంప్ కు గట్టి షాక్ తగిలింది. అదే సమయంలో భవిష్యత్తులో రిపబ్లికన్ అధ్యక్ష అభ్యర్థిగా ప్రచారంలో ఉన్న భారతీయ సంతతికి చెందిన వివేక్ రామస్వామి ఓహియో గవర్నర్ ఎన్నికల్లో పరాభవం ఎదురయింది. 2026 మిడ్ టర్మ్ ఎన్నికల్లో గవర్నర్ పీఠం కోసం రిపబ్లిక్ అండ్ పార్టీ తరఫున పోటీ చేసిన ఆయన.. డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి అమీ యాక్టన్ చేతిలో ఓడిపోయారు. అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కు అత్యంత సన్నిహితుడుగా, ఆయన మాగా విధానాలకు ప్రతినిధిగా ప్రచారం సాగించిన వివేక్ ఓడిపోవడం రిపబ్లిక్ కన్వర్గాలను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.

పడిపోయిన ట్రంప్ గ్రాఫ్…

స్వింగ్ స్టేట్ గా గుర్తింపు సాధించింది ఒహియో. అక్కడ వివేక్ రామస్వామి ఓటమికి ప్రధానంగా డోనాల్డ్ ట్రంప్ జాతీయ స్థాయి ప్రజాదరణ పడిపోవడమే కారణం అని భావిస్తున్నారు. వాస్తవానికి వివేక్ రామస్వామి అమెరికా రాజకీయాల్లో సంచలన నాయకుడిగా ఎదిగారు. కానీ దేశంలో తీవ్ర ద్రవ్యోల్బణం, ట్రంప్ తీవ్రవాద వ్యాఖ్యలు, ఏకపక్ష నిర్ణయాల పట్ల విసుగు చెందిన ఓటర్లు రిపబ్లిక్ కన్ల వైపు మొగ్గు చూపలేదు. వివేక్ రామస్వామి కూడా వ్యాపారవేత్తగా ఉన్న ఇమేజ్తో కాకుండా పూర్తిగా ట్రంప్ నీడలోనే ప్రచారం నిర్వహించడం, స్థానిక ఓహియో సమస్యల కంటే జాతీయస్థాయి వివాదాస్పద అంశాలపై ఎక్కువ దృష్టి పెట్టడం ఆయన విజయ అవకాశాలను దెబ్బతీసింది.

అనేక సందేహాలు…

గవర్నర్గా ఓటమితో అసలు వివేక్ రామస్వామి భవిష్యత్తులో అమెరికా అధ్యక్ష రేసులో ఉంటారా? లేదా అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. 2024 రిపబ్లిక్ ఆన్ అధ్యక్ష ప్రైమరీలలో పోటీ చేసి గుర్తింపు పొందారు. 2028 వైట్ హౌస్ రేసులో రిపబ్లిక్ అన్న తరపున ప్రధాన పోటీదారుగా ఉంటారని అంతా భావించారు. అయితే ఇప్పుడు సొంత రాష్ట్రంలోనే గవర్నర్గా గెలవలేని నాయకుడు.. జాతీయస్థాయిలో దేశాధ్యక్షుడిగా ఓట్లు ఎలా సాధించగలడనే బలమైన ప్రతికూల సంకేతం రిపబ్లికన్ ఓటర్లు, విరాళాలు ఇచ్చే డోనర్లలోకి వెళ్లిపోయింది. ఈ ఓటమితో వివేక్ రామస్వామి అధ్యక్ష కలకు దాదాపు బ్రేక్ పడినట్టే.

ఇవి కూడ చ‌ద‌వండి:
  1.  తల్లి మృతదేహం వద్దే రాత్రంతా రోదించిన మూడేళ్ల బాలుడు.. ఉరివేసుకుని మహిళ ఆత్మహత్య 
  2.  ఎమ్మిగనూరులో నకిలీ స్వామి గుట్టురట్టు
  3.  బీహార్‌లో దారుణం.. యువతిని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి అఘాయిత్యం!
  4.  ప్రేమ పేరుతో వేధింపులు.. ప్రపోజల్ తిరస్కరించిందని డిగ్రీ విద్యార్థినిపై లైంగిక దాడి!

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు