Homeఆంధ్ర ప్రదేశ్ప్ర‌జ‌ల క‌ష్టాల‌ను తీర్చ‌డ‌మే నా మొద‌టి ప్రాధాన్య‌త..!.నాకు ఎన్నిక‌లు ముఖ్యం కాదు.....సీఎం చంద్ర‌బాబు

ప్ర‌జ‌ల క‌ష్టాల‌ను తీర్చ‌డ‌మే నా మొద‌టి ప్రాధాన్య‌త..!.నాకు ఎన్నిక‌లు ముఖ్యం కాదు…..సీఎం చంద్ర‌బాబు

అమ‌రావ‌తి, క్రైమ్‌మిర్ర‌ర్‌: ప్ర‌జ‌ల క‌ష్టాల‌ను తీర్చ‌డ‌మే నా మొద‌టి ప్రాధ‌న్య‌త‌…నాకు ఎన్నిక‌లు ముఖ్యం కాద‌ని సీఎం చంద్ర‌బాబు స్ప‌ష్టం చేశారు. ఒక ప‌క్క ఎల్‌నినోతో 57 శాతం లోటు వ‌ర్ష‌పాతం, మ‌రోవైపు అర్నాబ్ తుఫాన్ కృష్ట జిల్లా నుంచి శ్రీ‌కాకులం వ‌ర‌కు దెబ్బ‌తీసింద‌న్నారు. రాష్ర్టానికి గ‌డ్డుకాల‌మ‌ని పేర్కొన్నారు. అదే విధంగా అర్నాబ్ నుంచి బ‌య‌ట‌ప‌డ‌క‌ముందే ముర‌సు తుఫాన్ అత‌లాకుతం చేసింద‌న్నారు. స్వ‌ల్ప వ్య‌వ‌ధిలో ఇలా రెండు తుపాలు రావ‌డం ఇదే ప్ర‌థ‌మ‌మ‌న్నారు. మురసు దిశ మార్చుకుని తీర ప్రాంతానికి దూసుకొచ్చి బాపట్ల, ప్రకాశం, గుంటూరు, ఎన్‌టీఆర్‌ జిల్లాలకు తీవ్ర విషాదం మిగిల్చిందని ఆవేదన వ్యక్తం చేశారు.

దెబ్బ‌తిన్న వ‌రిపొలాల ప‌రిశీల‌న‌…

ముర‌సు తుఫాన్ తో ప్రత్తిపాడు నియోజ‌క‌వ‌ర్గం కాకుమాను మండ‌లం రేటూరు గ్రామంలో ముర‌సు దెబ్బ‌తిన్న వ‌రిపొలాల‌ను సీఎం చంద్ర‌బాబు శుక్ర‌వారం సాయంత్రం ప‌రిశీలించారు. బాధిత రైతులతో మాట్లాడి వారి కష్టాలను తెలుసుకుని ధైర్యం చెప్పారు. ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని భరోసా కల్పించారు. రైతులు కూడా చైతన్యవంతులై పంటల బీమా చేసుకుంటే ఇలాంటి విపత్తులు వచ్చినా ఆర్థికంగా నష్టం జరగదని చెప్పారు. ‘విపత్తులు సంభవించినప్పుడు ప్రభుత్వం ఇన్‌పుట్‌ సబ్సిడీ ఇస్తోంది. అన్నదాత సుఖీభవ కింద రూ.20 వేలు పెట్టుబడి సాయంగా అందిస్తోంది. రైతులు బీమా కడితే నష్టపరిహారం వస్తుంది’ అని సూచించారు.

పంట చేతికొచ్చే సమయంలో…

ఖరీఫ్‌ సీజన్‌లో కృష్ణాడెల్టాకు పట్టిసీమ ద్వారా నీళ్లు అందించాం. నీటిని పొదుపుగా వినియోగించుకుని రైతులు వరి పండించారు. కొద్దిరోజుల్లో కోతలు అనగా మురసు దెబ్బకు పంట మట్టిపాలైపోయింది. తుఫానును ఎదుర్కొనేందుకు పకడ్బందీగా సన్నద్ధమయ్యాం. పునరావాసం కల్పించి ప్రాణ, ఆస్తినష్టాన్ని తగ్గించాం. రాయలసీమలో వర్షమే లేదు. కోస్తాలో తుఫాన్ల విపత్తులు. ఆర్‌టీజీఎస్‌ ద్వారా ఎప్పటికప్పుడు హెచ్చరికలు పంపి అధికారులను అప్రమత్తం చేయడం వల్లే నష్టాన్ని తగ్గించగలిగాం.

తుఫాను ధాటికి వేల విద్యుత్‌ స్తంభాలు నేలకొరిగాయి. దాంతో తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, తమిళనాడు, కర్ణాటక సీఎంలు విజయ్‌, డీకే శివకుమార్‌తో మాట్లాడి సిబ్బందిని పంపాలని కోరాను. వారు అంగీకరించి సిబ్బందిని పంపించారు. యుద్ధప్రాతిపదికన పనులు చేపట్టి ఇప్పటికే చాలావరకు గ్రామాలకు విద్యుత్‌ సరఫరా పునరుద్ధరించాం. మరో 1893 గ్రామాలకు శనివారం ఉదయం కల్లా ఇస్తాం.

తుఫాన్లలో నష్టపోయిన చివరి వ్యక్తికి కూడా న్యాయం తప్పక చేస్తా. ఏ ఒక్కరూ సాయం అందలేదన్న మాట రాకుండా చూసుకుంటాం. వీబీ-జీరాంజీ ఉపాధి పథకం కింద వ్యవసాయ, ఉద్యాన పంటలను చేర్చాలని కేంద్రానికి నివేదిస్తాం. ఎల్‌నినో ప్రభావం, రెండు తుఫాన్లతో జరిగిన నష్టాన్ని ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌షాకు నివేదించాను. తుది నివేదిక అందజేయగానే సాయం విడుదల చేస్తామని వారు హామీ ఇచ్చారు.

ఇవి కూడ చ‌ద‌వండి:
  1. తీవ్ర నైరాశ్యంలో వైసిపి…!
  2.  దారుణం.. భార్యను కుర్చీకి కట్టేసి పెట్రోల్ పోసి నిప్పంటించిన భర్త
  3. అగ్రరాజ్యంలో తెలుగు యువతి…!
  4.  బంగ్లాదేశ్‌లో భారత వైద్య విద్యార్థి అనుమానాస్పద మృతి.. చెరువులో లభించిన మృతదేహం!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు