క్రైమ్ మిర్రర్, స్పోర్ట్స్ :- భారత క్రికెట్ రంగానికి మరియు అభిమానులకు షాకింగ్ న్యూస్. టీమిండియా స్టార్ పేసర్ మహమ్మద్ షమీ టెస్ట్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించారు. ఈ విషయాన్ని ఆయన స్వయంగా ప్రముఖ సోషల్ మీడియా వేదిక ‘X’ ద్వారా అభిమానులతో పంచుకున్నారు. దేశం కోసం టెస్ట్ జెర్సీ ధరించి ఆడాలనే తన చిన్ననాటి కల నెరవేరిన తీరును, తన క్రికెట్ ప్రయాణంలో ఎదురైన అనుభవాలను ఆయన భావోద్వేగంతో గుర్తుచేసుకున్నారు.మైదానంలో ప్రతి వికెట్, ప్రతి కష్టతరమైన పోరాటం, తనకు తగిలిన ప్రతి గాయం కూడా జీవితంలో ఏదో ఒక కొత్త పాఠం నేర్పించాయని షమీ పేర్కొన్నారు. దేశం కోసం ఆడటం తనకెంతో గర్వకారణమని తెలిపారు. భారత జట్టు తరఫున ఆయన ఆడిన టెస్ట్ మ్యాచ్‌లలో అసాధారణ ప్రదర్శనతో ఎన్నో చిరస్మరణీయ విజయాలను అందించారు.
భారత్ తరఫున మొత్తం 64 టెస్ట్ మ్యాచ్‌లు ఆడిన షమీ, 229 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నారు. ఆయన బౌలింగ్ విన్యాసాలు విదేశీ గడ్డపై ప్రత్యర్థి బ్యాటర్లను వణికించాయి. ముఖ్యంగా 2013లో వెస్టిండీస్‌పై జరిగిన మ్యాచ్‌లో 9/118 గణాంకాలు నమోదు చేయడం ఆయన టెస్ట్ కెరీర్లోనే అత్యుత్తమ ప్రదర్శనగా నిలిచింది. తన కెరీర్లో ఎన్నో మ్యాచులను ఒంటిచేత్తో మలుపు తిప్పిన షమీ, చివరి అంతర్జాతీయ టెస్ట్ మ్యాచ్‌ను 2023లో ఆస్ట్రేలియాపై ఆడారు.గాయాల కారణంగా కొంతకాలంగా జట్టుకు దూరంగా ఉంటున్నప్పటికీ, ఆయన అందించిన సేవలు భారత క్రికెట్ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతాయి. షమీ టెస్ట్ రిటైర్మెంట్ వార్తతో క్రికెట్ వర్గాలు, అభిమానులు విచారం వ్యక్తం చేస్తూ ఆయన భవిష్యత్తుకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
రెండు తుఫాన్ల బీభత్సం.. సాయం అందించాలని అమిత్ షాకు చంద్రబాబు లేఖ
