Homeసినిమాదీపావళి బరిలో నిలవని టాలీవుడ్..!

దీపావళి బరిలో నిలవని టాలీవుడ్..!

క్రైమ్ మిర్రర్, సినిమా:- సాధారణంగా సినిమా పరిశ్రమలో పండగ సీజన్‌ వచ్చిందంటే చాలు బాక్సాఫీస్ వద్ద సందడి మాములుగా ఉండదు. సినిమాల విడుదలకు పండగలను మించిన ‘బిగ్ టైమ్’ మరొకటి ఉండదని టాలీవుడ్ సినీ వర్గాలు భావిస్తాయి. ఫెస్టివల్ సమయాల్లో కుటుంబ సమేతంగా ప్రేక్షకులు థియేటర్లకు వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉండటంతో, నిర్మాతలు ఈ సమయం కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. అయితే, ఈసరి దీపావళి పండగను మాత్రం టాలీవుడ్ పెద్దగా పట్టించుకోలేదనే చెప్పాలి.టాలీవుడ్‌లో కేవలం స్టార్ హీరోల సినిమాలే కాకుండా, మీడియం రేంజ్ హీరోల చిత్రాలు కూడా పెద్ద పండగలకు విడుదలవుతుండటం మనం చూస్తుంటాం. కానీ ఈ దీపావళి పండగకు మాత్రం స్టార్ హీరోలతో పాటు ఏ ఒక్క మీడియం రేంజ్ హీరో కూడా తమ సినిమాలను బరిలోకి దించేందుకు పెద్దగా ప్రయత్నించలేదు.

హోట‌ల్ గ‌దిలో అమెరికా పౌరుడి అనుమాన‌స్ప‌ద మృతి…! ఆ ప్రాంతంలో క‌ల‌క‌లం…

ఈ దీపావళికి టాలీవుడ్ నుంచి చెప్పుకోదగ్గ పెద్ద సినిమాలు ఏవీ విడుదల కాకపోవడం గమనార్హం. రామాయణం, ‘సీన్’ వంటి ఇతర భాషా చిత్రాలు ఈ పండగ బరిలో విడుదలైనప్పటికీ, మన తెలుగు నుంచి మాత్రం పెద్దగా ఆశించే స్థాయి సినిమాలు విడుదల కాలేదు. ఒకవేళ తెలుగు నుంచి గట్టి చిత్రాలు ఏవైనా బరిలో నిలిచి ఉంటే, ఈసారూ బాక్సాఫీస్ వద్ద పోటీ వాతావరణం పూర్తిగా వేరేలా ఉండేదేమోనని టాలీవుడ్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.మరి పండగ సీజన్‌ను టాలీవుడ్ నిర్మాతలు ఈ విధంగా వదిలేయడం వెనుక సరైన సరైన ప్రాజెక్ట్‌లు సిద్ధంగా లేకపోవడమా? లేక తదుపరి పెద్ద సినిమాల విడుదల కోసం ప్లాన్ చేసుకుంటున్నారా? అనే చర్చ సినీ వర్గాల్లో జరుగుతోంది. ఈ పరిణామంపై మీరేమంటారు? మీ అభిప్రాయాలను కామెంట్స్‌ రూపంలో తెలియజేయండి!

హోట‌ల్ గ‌దిలో అమెరికా పౌరుడి అనుమాన‌స్ప‌ద మృతి…! ఆ ప్రాంతంలో క‌ల‌క‌లం…

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది. పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు