Homeక్రైమ్హోట‌ల్ గ‌దిలో అమెరికా పౌరుడి అనుమాన‌స్ప‌ద మృతి...! ఆ ప్రాంతంలో క‌ల‌క‌లం...

హోట‌ల్ గ‌దిలో అమెరికా పౌరుడి అనుమాన‌స్ప‌ద మృతి…! ఆ ప్రాంతంలో క‌ల‌క‌లం…

హైద‌రాబాద్‌, క్రైమ్‌మిర్ర‌ర్‌: హ‌ఐహైద‌రాబాద్‌లోని గ‌చ్చిబౌలిలోని ఎస్ఎల్ ఎన్ టెర్మిన‌స్ భ‌వ‌నంలో మారియ‌ట్ ఎగ్జీక్యూటీవ్ అపార్ట్‌మెంట్‌లోని హోట‌ల్ గ‌దిలో అమెరికా పౌరుడు అమానుమానాస్ప‌దంగా మృతి చెంద‌డంతో ఆ ప్రాంతంలో ఒక్క‌సారిగా క‌ల‌క‌లం రేపింది. పోలీసులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం పోలీసుల కథనం ప్రకారం.. కాలిఫోర్నియాకు చెందిన మిచెల్‌ బ్రియాన్‌ లీ (41) తన వ్యాపార భాగస్వామి డేవిడ్‌ వూతో కలిసి నవంబర్‌ 2న వ్యాపార పనుల నిమిత్తం హైదరాబాద్‌కు వచ్చాడు. ఇద్దరూ గచ్చిబౌలిలోని మారియట్‌ ఎగ్జిక్యూటివ్‌ అపార్ట్‌మెంట్స్‌లో బస చేశారు. హోటల్‌ 12వ అంతస్తులోని 1218 నంబర్‌ గదిలో మిచెల్‌ ఉండగా.. డేవిడ్‌ మరో గదిలో దిగాడు.

నవంబర్‌ 4 సాయంత్రం నుంచి మిచెల్‌ గది నుంచి బయటకు రాకపోవడంతో పాటు ఫోన్‌ కాల్స్‌కు స్పందించలేదు. దీంతో అనుమానం వచ్చిన డేవిడ్‌ హోటల్‌ సిబ్బందికి సమాచారం ఇచ్చాడు. వారు మాస్టర్‌ కీతో గది తలుపులు తెరిచి చూడగా మంచంపై అపస్మారక స్థితిలో కనిపించాడు. వెంటనే 108 సిబ్బందికి సమాచారం అందించగా.. వారు పరీక్షించి అప్పటికే మృతిచెందినట్లు ధ్రువీకరించారు.ఘటనపై గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాతే మరణానికి కారణం వెల్లడయ్యే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు.

ఇవి కూడ చ‌ద‌వండి:
  1. తీవ్ర నైరాశ్యంలో వైసిపి…!
  2.  దారుణం.. భార్యను కుర్చీకి కట్టేసి పెట్రోల్ పోసి నిప్పంటించిన భర్త
  3. అగ్రరాజ్యంలో తెలుగు యువతి…!
  4.  బంగ్లాదేశ్‌లో భారత వైద్య విద్యార్థి అనుమానాస్పద మృతి.. చెరువులో లభించిన మృతదేహం!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు