Homeజాతీయంఏకతాటిపైకి 'ఇండియా కూట‌మి...! రాహుల్‌గాంధీకి గ్రీన్ సిగ్న‌ల్‌....

ఏకతాటిపైకి ‘ఇండియా కూట‌మి…! రాహుల్‌గాంధీకి గ్రీన్ సిగ్న‌ల్‌….

  • కాంగ్రెస్ పార్టీకి కూటమి సారథ్యం

  • మిగతా ప్రాంతీయ పార్టీలు కలిసి రాక తప్పలేదు

క్రైమ్ మిర్రర్, సెంట్రల్ డెస్క్: దేశంలో బిజెపికి వ్యతిరేక రాజకీయ పార్టీలన్నీ ఏకతాటిపైకి వస్తున్నాయి. ఇండియా కూటమి బలోపేతం పై గట్టి చర్చలే నడుస్తున్నాయి. ఇప్పటివరకు ఆ కూటమిలో ఎవరికి వారే యమునా తీరే అన్నట్టు ఉండేది. కానీ బలమైన ప్రాంతీయ పార్టీలన్నీ బిజెపి చేతిలో మట్టికరుస్తున్నాయి. దీంతో బలమైన ప్రాంతీయ నాయకత్వం బలహీనపడి.. కాంగ్రెస్ పార్టీకి మార్గం సుగమం అవుతోంది. ఇండియా కూటమికి సారథ్యం వహించే బాధ్యతలు రాహుల్ గాంధీకి చేరువ అవుతున్నాయి. ఢిల్లీలోని రామ్ లీలా మైదానంలో ఇండియా కూటమి భాగస్వామ్య పక్షాలు ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన బహిరంగ సభను.. రాబోయే ఒక పెద్ద బలపరీక్షగా అనుకోవచ్చు. వచ్చే ఎన్నికల్లో అధికార బిజెపికి మేమే బలమైన ప్రత్యామ్నాయం అని చాటి చెప్పడానికి.. ఈ సభను విజయవంతం చేసుకోవడం కాంగ్రెస్ నాయకత్వానికి అత్యవసరంగా మారింది.

కాంగ్రెస్ బలప్రదర్శన…

కాంగ్రెస్ పార్టీ బిజెపి పై పై చేయి సాధించేందుకు గట్టి బల ప్రదర్శనకు దిగింది. కాంగ్రెస్ పార్టీ హై కమాండ్ శ్రమించి.. దేశవ్యాప్తంగా ఉన్న వివిధ రాష్ట్రాల నుంచి కార్యకర్తలను, మద్దతుదారులను ఢిల్లీకి తరలించడంలో సఫలం అయింది. చివరకు సుదూర ప్రాంతాలైన దక్షిణాది రాష్ట్రాల నుంచి కూడా కేడర్ను సమయత్వం చేసి.. చారిత్రాత్మక మైదానంలో జనాన్ని నింపడం ద్వారా సభను గ్రాండ్ సక్సెస్ చేసుకున్నామని కాంగ్రెస్ గట్టిగా చెప్పుకోగలిగింది. అయితే ఈ సభ విజయం సాధించినా.. రాజకీయ ప్రభావం ఎంత అన్న దానిపై మాత్రం భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రధానంగా చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ వైఖరి, ఓటర్ల జాబితాల సవరణ, కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలకు వ్యతిరేకంగా ఒక పోరాట వేదికగా ఈ సభను మలిచారు. కానీ కేవలం ఒక రాజ్యాంగ అధికారిపై, ఒక నిర్దిష్ట అంశంపై యుద్ధం ప్రకటించడం ద్వారా రాబోయే సార్వత్రిక ఎన్నికల నాటికి ఓటర్ల మైండ్ సెట్ ను ఎంతవరకు మార్చగలరనేది ప్రశ్నార్ధకమే.

కూటమిలో ఐక్యత…

రామ్ లీలా మైదానం వేదికగా సాగిన ఈ సభ ఇండియా కూటమిలో ఐక్యతను చాటింది. గతంలో కాంగ్రెస్ నాయకత్వాన్ని,, రాహుల్ పెత్తనాన్ని సహించలేని ప్రాంతీయ పార్టీలు కూడా వేదికను పంచుకున్నాయి. అలా రావాల్సిన పరిస్థితి కూడా ఎదురయింది. ఈ సభ బిజెపిని తక్షణమే డిఫెన్స్ లో పడేయకపోవచ్చు కానీ.. చల్లా చిదురుగా ఉన్న ప్రతిపక్ష శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపడంలో మాత్రం సక్సెస్ అయ్యింది. ఢిల్లీ వేదికగా ప్రదర్శించిన ఈ ఐక్యత ఎంత కాలం కొనసాగుతుంది అనేది ప్రశ్న. ఎందుకంటే వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో సీట్ల సర్దుబాటు చేసుకుని కలివిడిగా పోటీ చేయాల్సి ఉంటుంది. అప్పుడు ఎదురయ్యే రాజకీయ విభేదాలను తట్టుకుంటేనే ఇండియా కూటమి ఐక్యత సాధ్యం. ఆపై రాహుల్ గాంధీ నాయకత్వానికి సరైన దిశా నిర్దేశం పడినట్లు అవుతుంది.

ఇవి కూడ చ‌ద‌వండి:
  1.  ట్రంప్‌కు సవాళ్ల సుడిగుండం: రాజకీయ, దౌత్య రంగాల్లో వరుస పరాజయాలు
  2.  మైదానానికి వీడ్కోలు.. ఇంటర్నేషనల్ ఫుట్‌బాల్‌కు ‘రొనాల్డో’ గుడ్‌బై!
  3.  గురువుపై అభిమానానికి హద్దుల్లేవు… రాఘవ లారెన్స్ కీలక నిర్ణయం!
  4.  స్మార్ట్‌ఫోన్ ప్రియులకు బిగ్ షాక్.. భారీగా పెరగనున్న మొబైల్ ఫోన్ల ధరలు!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు