Homeసినిమాచిన్ననాటి స్నేహితురాలితో సాయిధరమ్ తేజ్ నిశ్చితార్థం.. మెగా హీరోల కోలాహలం!

చిన్ననాటి స్నేహితురాలితో సాయిధరమ్ తేజ్ నిశ్చితార్థం.. మెగా హీరోల కోలాహలం!

క్రైమ్ మిర్రర్,సినిమా:-
టాలీవుడ్ సుప్రీమ్ హీరో సాయిధరమ్ తేజ్ ఒక ఇంటివారు కాబోతున్నారు. ఆయన తన చిన్ననాటి స్నేహితురాలు కిరణ్మయితో వివాహ బంధానికి తొలి అడుగు వేశారు. కుటుంబ సభ్యులు, అత్యంత ఆత్మీయుల సమక్షంలో వీరి నిశ్చితార్థ వేడుక ఘనంగా జరిగింది.

ఈ వేడుకకు మెగా మరియు అల్లు కుటుంబాలకు చెందిన కథానాయకులు హాజరై ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, వరుణ్ తేజ్, అల్లు శిరీష్, వైష్ణవ్ తేజ్ తదితరులు ఈ శుభకార్యానికి విచ్చేసి కొత్త జంటను ఆశీర్వదించారు.మెగా హీరోలందరూ ఒకే వేదికపై సందడి చేసిన క్షణాలు అభిమానులను ఎంతగానో అలరిస్తున్నాయి. ఈ వేడుకలో అందరూ కలిసి దిగిన ప్రత్యేకమైన గ్రూప్ ఫోటోను రామ్‌చరణ్ తన సోషల్ మీడియా ఖాతాలో పంచుకుంటూ, కొత్త జంటకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.

సాయిధరమ్ తేజ్ – కిరణ్మయిల వివాహ వేడుక డిసెంబర్ 10న హైదరాబాద్‌లోనే అత్యంత వైభవంగా జరగనున్నట్లు సమాచారం. ఈ వార్త తెలియడంతో మెగా అభిమానులు మరియు సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా ఈ జంటకు శుభాకాంక్షల వర్షం కురిపిస్తున్నారు.

ట్రంప్‌కు సవాళ్ల సుడిగుండం: రాజకీయ, దౌత్య రంగాల్లో వరుస పరాజయాలు

మైదానానికి వీడ్కోలు.. ఇంటర్నేషనల్ ఫుట్‌బాల్‌కు ‘రొనాల్డో’ గుడ్‌బై!

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది. పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు