Homeక్రైమ్సూరత్‌లో దారుణం: ఇంటిపనులు చెప్పినందుకు తండ్రిని హతమార్చిన కుమార్తె

సూరత్‌లో దారుణం: ఇంటిపనులు చెప్పినందుకు తండ్రిని హతమార్చిన కుమార్తె

క్రైమ్ మిర్రర్ : గుజరాత్‌లోని సూరత్‌ నగరంలో అత్యంత విషాదకర ఘటన వెలుగు చూసింది. ఇంటిపనులు చేయలేదనే కోపంతో తండ్రిని కన్నకూతురే అత్యంత కిరాతకంగా హతమార్చింది. సూరత్‌లోని అమ్రోలి ప్రాంతంలో రమేష్‌సింగ్ కైలాష్‌సింగ్ రాజ్‌పుత్ తన కుటుంబంతో కలిసి నివసిస్తున్నారు. అక్టోబర్ 31వ తేదీ రాత్రి 10.30 గంటల సమయంలో రమేష్‌సింగ్, తన భార్య మంజుబెన్, చిన్న కుమార్తె కాజల్‌తో ఇంటి విషయాలపై మాట్లాడారు. ఈ క్రమంలో ఇంటి పనులు సరిగా చేయకపోవడంపై కుమార్తె కాజల్‌ను ఆయన మందలించారు. అంతేకాకుండా ఆమె చేతిలోని మొబైల్ ఫోన్‌ను లాక్కుని నేలకేసి కొట్టారు.
తండ్రి తన ఫోన్‌ పగలగొట్టడంతో కాజల్ తీవ్ర ఆగ్రహానికి గురైంది. క్షణంపాటు ఆవేశానికి లోనైన ఆమె, వంటగదిలోకి వెళ్లి ప్రెషర్ కుక్కర్ మూత తెచ్చి తండ్రి తలపై పదేపదే బలంగా కొట్టింది. ఆ తర్వాత కత్తితో ఆయన కడుపులో పొడవడంతో తీవ్ర రక్తస్రావమై రమేష్‌సింగ్ అక్కడికక్కడే కుప్పకూలిపోయారు. కుటుంబ సభ్యులు వెంటనే 108 అంబులెన్స్‌కు సమాచారం అందించగా.. వైద్య సిబ్బంది వచ్చి పరిశీలించి అప్పటికే రమేష్‌సింగ్ మృతి చెందినట్లు నిర్ధారించారు. మృతుడి భార్య మంజుబెన్ ఫిర్యాదు మేరకు అమ్రోలి పోలీసులు 22 ఏళ్ల కుమార్తె కాజల్‌పై హత్య కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. అనంతరం ఆమెను జ్యుడిషియల్ కస్టడీకి తరలించారు. తండ్రి హత్యకు దారితీసిన పరిస్థితులపై పోలీసులు మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.
also read : బాలీవుడ్ నటుడు తుషార్ కపూర్‌కు బెదిరింపులు.. రూ.5 కోట్లు ఇవ్వాలని డిమాండ్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు