Homeతెలంగాణఇక మల్లన్న సాగర్...!

ఇక మల్లన్న సాగర్…!

  • కట్ట భద్రతపై వివాదం

  • మాజీమంత్రి హరీష్ రావు పక్కా రాజకీయ వ్యూహం

క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో: తెలంగాణలో రాజకీయంగా పట్టు బిగించాలని గులాబీ పార్టీ గట్టి ప్రయత్నాల్లోనే ఉంది. అందుకు ఏ చిన్న అవకాశాన్ని కూడా విడుచుకోవడానికి ఇష్టపడడం లేదు. తాజాగా మల్లన్న సాగర్ రిజర్వాయర్ కట్ట భద్రతపై ఆ పార్టీ ముఖ్య నేతల్లో ఒకరైన హరీష్ రావు సంచలన ఆరోపణలు చేశారు. రిజర్వాయర్ కట్టకు కేవలం 100 మీటర్ల పరిధిలోనే ఎలాంటి అనుమతులు లేకుండా పేలుళ్ళు జరుపుతున్నారని… దీనివల్ల కట్ట బలహీనపడి లీ కేజీలు వస్తున్నాయని.. సమీప గ్రామంలోని ఇళ్లకు పగుళ్లు వచ్చాయని ఆరోపించారు. గతంలో మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోయిన ఉదంతాన్ని గుర్తుచేస్తూ.. మల్లన్న సాగర్ ను కూడా కూల్చి వేసేందుకు ప్రభుత్వం కుట్ర పన్నుతోందా అంటూ విమర్శలు గుప్పించడం ద్వారా ప్రజల్లోకి బలమైన సంకేతాలు పంపించారు హరీష్ రావు.

ఆధారాలతో సహా ఖండన…

అయితే మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపణలను నీటిపారుదల శాఖ, జిల్లా అధికార యంత్రాంగం ఆధారాలతో సహా ఖండించింది. అక్కడ జరుగుతున్నది ఎలాంటి అక్రమ మైనింగ్ లేదా రిజర్వాయర్ కు నష్టం కలిగించే బ్లాస్టింగ్లు కావని.. మిషన్ భగీరథ, సాగునీటి పంపిణీ నెట్వర్కు సంబంధించిన పైప్ లైన్ అనుసంధాన పనులని అధికారులు స్పష్టం చేస్తున్నారు. కఠినమైన రాతి నెలలను తొలగించి పైప్ లైన్లను వేసేందుకు అవసరమైన మైక్రోబ్లాస్టింగ్ లను నిబంధనల ప్రకారమే.. ప్రాజెక్టు కట్టకు ఎటువంటి భౌతిక నష్టం కలగకుండా.. పక్కా సాంకేతిక పర్యవేక్షణలోనే చేపడుతున్నట్లు తేల్చి చెప్పారు. ప్రజలను, మీడియాను తప్పుదోవ పట్టించకుండా వాస్తవాలను తెలియజేసేందుకు పనులకు సంబంధించిన సమగ్ర వివరాలు, ప్రత్యక్ష దృశ్యాలతో కూడిన వీడియో ఆధారాలను సైతం అధికారులు మీడియాకు విడుదల చేశారు.

సుదీర్ఘ అనుభవం ఉన్నా…

తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రిగా హరీష్ రావుకు సుదీర్ఘ అనుభవం ఉంది. మల్లన్న సాగర్ నిర్మాణాన్ని స్వయంగా పర్యవేక్షించిన హరీష్ రావుకు ప్రాజెక్టుల అనుసంధాన పనులు, పైప్ లైన్ విస్తరణ సాంకేతికతలు తెలియనివి కావు. అయినా అధికారిక పనులను కూడా అక్రమ బ్లాస్టింగులు, రిజర్వాయర్ కూల్చివేత కుట్ర అంటూ చిత్రీకరించడం వెనుక రాజకీయ దురుద్దేశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వంపై క్షేత్రస్థాయిలో ప్రజల్లో అనుమానాలు రేకెత్తించి.. ప్రాజెక్టుల భద్రత పేరుతో రాజకీయ లబ్ది పొందాలని ఆరాటంతోనే.. వాస్తవాలు తెలిసి కూడా లేని వివాదాన్ని సృష్టించేందుకు ప్రయత్నించారన్న అభిప్రాయం బలపడుతోంది.

ఇవి కూడ చ‌ద‌వండి:
  1.  నీతా అంబానీ ఉదారత: ముంబైలో 100 ఎకరాల్లో ‘అనంత ఆశ్రయ్’ ప్రాజెక్ట్ ప్రారంభం!
  2. ఆర్థిక భద్రతకు పొదుపే మార్గం: ఈఎంఐల భారం తగ్గించుకోవాలని నిపుణుల సూచన!
  3.  సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో రూ.60 లక్షల నకిలీ నోట్లు పట్టివేత
  4.  28 ఏళ్ల క్రితం హత్య చేసి పరారీ.. ఎట్టకేలకు పోలీసులకు చిక్కిన నిందితుడు

 

 

 

 

 

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు