-
సొంత పార్టీ మహిళా నేత నిర్వాకం
-
ఓ టీవీ ఛానల్ యాజమాన్యంతో కలిసి ప్రయోగం
-
మండిపడుతున్న మంత్రి యతేంద్ర సిద్ధరామయ్య
క్రైమ్ మిర్రర్, సెంట్రల్ డెస్క్: కర్ణాటక కాంగ్రెస్ లో సరికొత్త సంచలనం. వివాదాస్పద స్టింగ్ ఆపరేషన్ వ్యవహారం ఆ పార్టీ అంతర్గత విభేదాలను, రాజకీయ కుట్రలను ఒక్కసారిగా బయటపెట్టింది. తన రాజకీయ ప్రతిష్టను దిగజార్చేందుకు, బ్లాక్ మెయిల్ చేసేందుకు నకిలీస్టింగ్ ఆపరేషన్ రూపొందించాలని మాజీ సీఎం సిద్దరామయ్య తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ కుట్ర వెనుక పవర్ టీవీ ఛానల్ మేనేజింగ్ డైరెక్టర్ రాకేశ్ శెట్టితో పాటు కాంగ్రెస్ పార్టీకి చెందిన మహిళ నేత కృప ఆల్వా ప్రధాన పాత్ర పోషించారని సిద్ధరామయ్య చెబుతుండడం ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ వ్యవహారంలో చట్టపరమైన చర్యల కోసం ఆయన ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేశారు. వీడియోల వ్యాప్తిపై కోర్టు నుంచి స్టే కూడా తెచ్చుకున్నారు.
కాంగ్రెస్ క్రియాశీలక నాయకురాలు…
కర్ణాటకలోని దక్షిణ కన్నడ జిల్లాకు చెందిన కృప ఆల్వా కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలకంగా పనిచేసిన నాయకురాలిగా గుర్తింపు పొందారు. గతంలో కర్ణాటక రాష్ట్ర పిల్లల హక్కుల పరిరక్షణ కమిషన్ అధ్యక్షురాలిగా బాధ్యతలు స్వీకరించారు. దక్షిణ కన్నడ లోని పుత్తూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ టికెట్ ఆశించారు. కానీ దక్కకపోవడంతోనే స్ట్రింగ్ ఆపరేషన్ ప్లాన్ చేశారు అనేది సిద్ధరామయ్య కుమారుడు యతేంద్ర సిద్ధరామయ్య చెబుతున్న మాట. రాజకీయ ఆకాంక్షలు నెరవేరకపోవడం, టికెట్ దక్కక పోవడమే ఈ కుట్రకు ప్రధాన కారణం అని తెలుస్తోంది. టికెట్ ఆశించి భంగపడిన సదరు నేత సిద్ధరామయ్య ఇమేజ్ను దెబ్బతీసి ఆయన రాజకీయ వారసత్వాన్ని అంతం చేయాలనే దురుద్దేశంతో ఈ నకిలీ వీడియో డ్రామాకు తెరలేపారని యతేంద్ర ఆరోపిస్తున్నారు.
పోలీస్ విచారణ…
మరోవైపు స్ట్రింగ్ ఆపరేషన్ ఆరోపణలపై బెంగళూరు పోలీసులు సమగ్ర విచారణ వేగవంతం చేశారు. పవర్ టివి రాకేశ్ శెట్టిని విచారించిన అధికారులు కు ఆయన, కృప ఆల్వా, కొందరు కీలక రాజకీయ నాయకుల మధ్య జరిగిన సంభాషణలకు సంబంధించిన కాల్ డీటెయిల్ రికార్డులు లభ్యమయ్యాయి. డిజిటల్ ఆధారాలను పోలీసులు ముందు ఉంచగా.. విచారణ నుంచి తప్పించుకునేందుకు రాజేష్ శెట్టి తక్షణమే కోర్టును ఆశ్రయించి ముందస్తు బెయిల్ పొందారు. సోషల్ మీడియాలో, మీడియా వర్గాల్లో వైరల్ అవుతున్న వీడియో సంభాషణలలో సిద్ధరామయ్య పై పగ తీర్చుకోవడానికి ఎలా ట్రాప్ చేయాలని ప్లాన్ చేసిన ఆధారాలు ఉన్నట్లు గుర్తించారు.
కాంగ్రెస్ అంతర్గత విభేదాలు…
అయితే ఈ మొత్తం ఎపిసోడ్ వెనుక కాంగ్రెస్ పార్టీలో ఉన్న అంతర్గత విభేదాలు బయటపడుతున్నాయి. 1984 నుంచి సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో ఎన్నడూ లేని విధంగా.. తాను అధికారంలో లేని సమయంలో ఇలాంటి చౌకబారు బ్లాక్‌మెయిలింగ్ కుట్రలు పన్నుతున్నారని సిద్ధరామయ్య మండిపడ్డారు. కేవలం ఒక కార్యకర్త లేదా నేత చేసిన స్వార్థపూరిత చర్యను ఆధారంగా చేసుకుని.. మొత్తం పార్టీకి ఆపాదించలేమని మంత్రి యతేంద్ర పేర్కొంటున్నారు. కానీ ప్రత్యర్థి పార్టీలైన బిజెపి, జెడిఎస్ ఈ అంశాన్ని ఆసరాగా చేసుకుని కాంగ్రెస్ పార్టీలోని దిగజారుడు రాజకీయాలను తీవ్రంగా ఎండగడుతున్నాయి.
ఇవి కూడ చదవండి:
-
బిఆర్ఎస్ లో సంక్షోభం…? హరీష్ రావును దూరం పెడుతున్న కేసీఆర్…
-
30 ఏళ్ల సేవలకు ముగింపు…! సీనియర్ కెమెరామెన్ శ్రీనివాస్ కన్నుమూత…
-
కర్ణాటకలో కాంగ్రెస్ కు షాక్…! బీజేపీ-జేడీఎస్ కూటమి క్లీన్‌స్వీప్…
-
కేటీఆర్ కు స్వల్ప ఊరట…!
