క్రైమ్ మిర్రర్, సినిమా:- సామాన్యుల సమస్యలు, విప్లవాత్మక కథలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే పీపుల్స్ స్టార్ ఆర్.నారాయణమూర్తి తన శైలిని మార్చుకుని సరికొత్త నిర్ణయం తీసుకున్నారు. ఆయన నటించిన ‘హుషారు-2’ సినిమా నుంచి తాజాగా విడుదలైన టీజర్ ప్రేక్షకుల దృష్టిని విశేషంగా ఆకట్టుకుంటోంది. ఈ టీజర్లో “తమ్ముళ్లూ.. వేట మొదలేడదామా” అంటూ ఆయన చెప్పిన మాస్ డైలాగ్ బాగా పాపులర్ అవుతోంది.
బెంగళూరులో డీఆర్డీఓ శాస్త్రవేత్త మృతి.. ఘటనపై పోలీసుల దర్యాప్తు
తాజాగా తన కెరీర్ మార్పుపై స్పందించిన నారాయణమూర్తి, తాను సినిమాలు చేయడానికే పరిశ్రమలోకి వచ్చానని స్పష్టం చేశారు. మంచి ప్రాధాన్యత ఉన్న పాత్రలు లభిస్తే కమర్షియల్ సినిమాల్లో సైతం నటించేందుకు సిద్ధంగా ఉన్నానని వెల్లడించారు. గతంలో ఎన్టీఆర్ నటించిన ‘టెంపర్’ చిత్రంలో వచ్చిన కీలక పాత్రను తిరస్కరించిన ఆయన, ఇప్పుడు మనసు మార్చుకుని కమర్షియల్ ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం టాలీవుడ్లో ఆసక్తికరంగా మారింది.
