Homeఆంధ్ర ప్రదేశ్ప్ర‌మాద‌క‌ర స్థాయిలో ఎల్‌నినో....!ఏపీ రైతుల కిడ్నీల‌పై తీవ్ర ప్ర‌భావం...! నిపుణులు ఏం చెబుతున్నారంటే...

ప్ర‌మాద‌క‌ర స్థాయిలో ఎల్‌నినో….!ఏపీ రైతుల కిడ్నీల‌పై తీవ్ర ప్ర‌భావం…! నిపుణులు ఏం చెబుతున్నారంటే…

హైద‌రాబాద్‌, క్రైమ్‌మిర్ర‌ర్‌: రాష్ర్ట వ్యాప్తంగా ఎల్‌నినో ప్ర‌భావం ప్ర‌మాద‌క‌ర స్థాయికి చేరుకుంది. ఎల్‌నినో అంటే క‌రువు, నీటి ఎద్ద‌డి, ఎండిపోయిన పంట పొలాలే క‌నిపిస్తాయి. తాజాగా ఎల్‌నిన్ ఎఫెక్ట్ తో భానుడి భ‌గ‌భ‌గ‌లు ప్ర‌మాద‌క‌ర స్థాయికి చేరుకుంటున్న నేప‌థ్యంలో రైతు, కూలీల‌పై తీవ్ర ప్ర‌భావం చూపుతుంది. ఇప్పుడు వాత‌వ‌ర‌ణ మార్పు కారణంగా మ‌నుషుల మీద దాడి చేస్తోంద‌నే చేదు నిజం తాజా నివేదిక‌ల్లో వెల్ల‌డింది. పొలాల్లో ఎండ‌లో శ్ర‌మించే రైతు, కూలీలు ఏపీలో కిడ్నీ వ్యాధిన ప‌డుతున్న‌ర‌నే విష‌యం క‌ల‌వ‌ర‌పెడుతోంది. ఎల్‌నినో ఎఫెక్ట్ మూత్ర‌పిండాల‌పై ప్ర‌భావం ఎలా చూపుతుందో…నిపుణులు ఏం చెబుతున్నారో తెలుసుకుందాం….

ఎల్‌నినో ప్ర‌భావంతో రోజు రోజుకు స‌గ‌టు ఉష్ణోగ్ర‌త‌లు పెరిగిపోతున్నాయి. దీంతో వేస‌విని త‌ల‌పించే ఎండ‌లు మండుతున్నాయి. దీంతో ఎల్‌నినో తీవ్ర‌త‌పై వ‌చ్చే నివేదిక‌లు దేశ ప్ర‌జ‌లను క‌ల‌వ‌రానికి గురిచేస్తున్నాయి. ఎల్‌నినో ప్ర‌భావం పంట పొలాల‌పైనే కాకుండా శ్ర‌మ జీవుల ఆరోగ్యంపై తీవ్ర ప్ర‌భావం చూపిస్తున్నాయ‌ని నివేదిక‌లు చెబుతున్నాయి. గ్లోబల్ హీట్ హెల్త్ ఇన్ఫర్మేషన్ నెట్‌వర్క్ సౌత్ ఏషియా హబ్ నివేదిక ప్రకారం ఒడిశాలోని బర్‌గఢ్ జిల్లా రైతులు రోజంతా రైతులు, కూలీలు ఎండలో పనిచేయడం, వ్యవసాయంలో ఎక్కువగా రసాయనాలు వాడటం వల్ల వారిలో ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నట్లు గుర్తించారు. అయితే ఒడిశాతో పాటు ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, గోవాలలో ఈ కిడ్నీ సమస్యలు ఎక్కువగా పెరుగుతున్నప్పటికీ.. వాటికి నిర్దిష్ట కారణం ఏంటనేది మాత్రం తెలియట్లేదు.

అధ్య‌య‌నాలు ఏం చెబుతున్నాయి…

రాష్ట్రంలోని రైతుల్లో రోజురోజుకూ పెరుగుతున్న ఈ కిడ్నీ సమస్యలపై నిపుణులు దృష్టిపెట్టి ఉద్దానం ప్రాంతంలో 36 గ్రామాల ప‌రిధిలో 18 నుంచి 75 ఏళ్ల వ‌య‌స్సున్న కార్మికుల‌పై అధ్య‌యం నిర్వ‌హించారు. ముఖ్యంగా ఇటుక బ‌ట్టీలు, నిర్మాణ రంగం, వ్య‌వ‌సాయం రంగంలో ప‌ని చేసే కార్మికులు ఎండ వేడిమి వ‌ల్ల అనేక ఆరోగ్య స‌మ‌స్య‌లు త‌లెత్తిన‌ట్లు పేర్కొంటున్నారు.ఉష్నోగ్రతలు 27.5 డిగ్రీల సెల్సియస్ దాటినప్పుడు బరువైన పనులు చేసేవారికి, 28 డిగ్రీలు దాటినప్పుడు సాధారణ పనులు చేసేవారికి కిడ్నీల పనితీరు దెబ్బతినే ప్రమాదం సాధారణం కంటే రెండింతలు ఎక్కువగా ఉందని గుర్తించారు. తీవ్ర‌మైన ఎండ‌ల కార‌ణంగా కార్మికుల సామ‌ర్థ్యం, కుటుంబ ఆదాయ‌న్ని కూడ దెబ్బ‌తీస్తున్న‌ట్లు నివేదిక‌లు వెల్ల‌డించాయి. 2021-23 మధ్య కాలంలో తమిళనాడులో ఏర్పడిన పరిస్థితులే ఇందుకు నిదర్శనమని నివేదికలు తెలిపాయి.

సూచనలు….

ఎల్‌నినో తో పెరుగుతున్న ఎండ‌ల కార‌ణంగా దేశంలో ఎండ తీవ్ర‌త‌తో వ‌చ్చే రోగాలు, స‌మ‌స్య‌లు ముంద‌స్తు చ‌ర్య‌లు లేని కార‌ణంగా పెరుగుతున్నాయి. వీటిని త‌గ్గించేందుకు ఎండ‌లు ముదిరిన‌ప్పుడే కాకుండా ప్ర‌జ‌లంద‌రిని కాపాడేందుకు ప్ర‌భుత్వం ముందస్తుగానే ప‌క్కా ప్ర‌ణాళిక‌ల‌తో ప‌ని చేయాల‌ని సూచిస్తోంది. రైతు, కూలీల ఎండ త‌గ‌ల‌కుండా ప‌ని వేళ‌లు మార్చ‌డం స‌రిప‌డా తాగునీరు అందించ‌డం చేయాలి. అంతేగ‌కుండా న‌గ‌రాల్లో సైతం చెట్లు నీడ ఉండేలా ప్ర‌ణాళిక చేసుకోవ‌డం, ముందుగానే ఆసుప‌త్రిని సిద్దం చేసుకోవాల‌ని స్ప‌ష్టం చేస్తుంది.

ఇవి కూడ చ‌ద‌వండి:
  1. నాణ్య‌మైన క‌రెంటు ఇవ్వాలి…! బెల్లంప‌ల్లి స‌బ్‌స్టేష‌న్ ఎదుట రైతుల నిర‌స‌న‌…
  2. భారీ దోపిడి…! క‌ళ్ల‌లో పెప్ప‌ర్ స్ర్పే కొట్టి 21ల‌క్ష‌ల తో ఉడాయింపు…!
  3.  రైలు ఎక్క‌బోయి కింద‌ప‌డిపోయిన తండ్రి, కూతురు…! ఎలా కాపాడారంటే…
  4. ఘోర రోడ్డు ప్ర‌మాదం…! మిమిక్రీ ఆర్టిస్టు దుర్మ‌ర‌ణం…

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు