Homeక్రైమ్ఢిల్లీ మెట్రోలో సీటు కోసం గొడవ.. వ్యక్తి మృతి, మాజీ ఐఏఎస్ అధికారి అరెస్ట్!

ఢిల్లీ మెట్రోలో సీటు కోసం గొడవ.. వ్యక్తి మృతి, మాజీ ఐఏఎస్ అధికారి అరెస్ట్!

ఢిల్లీలో మెట్రో రైలులో సీటు విషయంలో మొదలైన వివాదం తీవ్ర విషాదానికి దారితీసింది. సీనియర్ సిటిజన్లకు కేటాయించిన సీటు అంశంపై జరిగిన వాగ్వాదం చివరకు ఓ వ్యక్తి ప్రాణాలను బలిగొంది. ఈ ఘటనకు సంబంధించి మాజీ ఐఏఎస్ అధికారి, ఆయన కుమారుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.

వివరాల్లోకి వెళ్తే.. అక్టోబర్ 8న సుప్రీంకోర్టు మెట్రో స్టేషన్ సమీపంలో పవన్ శర్మ (48)కు, మాజీ ఐఏఎస్ అధికారి సంజయ్ ప్రతాప్ సింగ్, ఆయన కుమారుడు సిద్ధార్థ్ సింగ్‌లకు మధ్య సీటు విషయంలో వివాదం తలెత్తింది. ఈ క్రమంలో ఇరువురి మధ్య మాటామాటా పెరిగి వాగ్వాదం చోటుచేసుకుంది.

వివాదం తీవ్రం కావడంతో నిందితులు పవన్ శర్మను వెనక్కి తోసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ఆయన అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు. వెంటనే ఆసుపత్రికి తరలించినప్పటికీ, చికిత్స పొందుతూ మృతి చెందారు. దీంతో ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

పవన్ శర్మ మృతిపై ఆయన తల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు మాజీ ఐఏఎస్ అధికారి సంజయ్ ప్రతాప్ సింగ్, ఆయన కుమారుడు సిద్ధార్థ్ సింగ్‌లను అరెస్ట్ చేశారు. ఈ ఘటనకు దారితీసిన పరిస్థితులు, గొడవకు సంబంధించిన పూర్తి వివరాలపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

also read: ఢిల్లీలో నిరసనలకు బ్రేక్‌.. జంతర్ మంతర్‌లో ధర్నాలపై పోలీసుల కీలక నిర్ణయం!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు