Homeక్రైమ్తాపీ నదిలో నవదంపతుల మృతదేహాలు.. కాళ్లకు ఇనుప గొలుసులు, తాళం!

తాపీ నదిలో నవదంపతుల మృతదేహాలు.. కాళ్లకు ఇనుప గొలుసులు, తాళం!

మహారాష్ట్ర తాపీ నదిలో నవదంపతుల మృతదేహాలు కలకలం బయటపడటంతో కలకలం రేగింది. వారి కాళ్లకు ఇనుప గొలుసులు కట్టి, తాళం వేసి ఉండటాన్ని పోలీసులు గుర్తించారు. ఈ ఘటన వెనుక ఉన్న కారణాలపై ప్రస్తుతం తీవ్ర ఉత్కంఠ నెలకొంది.

మహారాష్ట్రలోని ధూలే జిల్లాలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. తాపీ నదిలో రెండు మృతదేహాలను గుర్తించిన పోలీసులు వాటిని బయటకు తీసి పరిశీలించారు. మృతులను జలగావ్‌ జిల్లాకు చెందిన శ్యామ్‌ హరి పాటిల్‌, స్వప్న పాటిల్‌గా గుర్తించారు. వీరిద్దరూ భార్యాభర్తలని, కొన్ని నెలల క్రితమే ప్రేమ వివాహం చేసుకున్నారని అధికారులు వెల్లడించారు.

అయితే, ఇద్దరి కాళ్లకు ఇనుప గొలుసులు కట్టి, తాళం వేసి ఉండటం పలు అనుమానాలకు తావిస్తోంది. ఈ జంట మరణాలు ప్రమాదవశాత్తూ జరిగాయా? లేక ఎవరైనా హత్య చేసి నదిలో పడేశారా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మరోవైపు, ఇతర అవకాశాలను కూడా పోలీసులు పరిశీలిస్తున్నారు.

ఈ ఘటనకు సంబంధించి ఇప్పటివరకు మరణాల వెనుక అసలు కారణం స్పష్టంగా తెలియరాలేదు. అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. విచారణ పూర్తయిన తర్వాతే ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.

also read: పెళ్లికి పెద్దల నిరాకరణ.. ఇన్‌స్టాగ్రామ్ లైవ్‌లో ప్రేమజంట బలవన్మరణం!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు