Homeజాతీయంమోదీ నియంతృత్వ పాల‌న కొన‌సాగిస్తున్నారు...! కేజ్రీవాల్‌

మోదీ నియంతృత్వ పాల‌న కొన‌సాగిస్తున్నారు…! కేజ్రీవాల్‌

ఢిల్లీ, క్రైమ్‌మిర్ర‌ర్‌: నేడు ఢిల్లీలో సీజీపీ ఆధ్వ‌ర్యంలో జంత‌ర్‌మంత‌ర్ వ‌ద్ద చేప‌ట్ట‌నున్న ఆందోళ‌న‌ల నేప‌థ్యంలో కేంద్రం వ్య‌వ‌హరిస్తున్న తీరు దారుణంగా ఉంద‌ని ఆప్ జాతీయ క‌న్వీన‌ర్ అర‌వింద్ కేజ్రీవాల్ దుయ్య‌బ‌ట్టారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న ఎక్స్‌వేదిక‌గా స్పందించారు. దేశంలో మోదీ నియంతృత్వ పాల‌న కొన‌సాగిస్తున్నార‌ని మండిప‌డ్డారు. మ‌నం ఆయ‌న సంపూర్ణ ఆధిప‌త్యంలో జీవిస్తున్నామ‌ని, ఎమర్జెన్సీలో కూడ ఇంత దారుణంగా లేద‌ని దానికి మించి ఉంద‌ని ఆందోళ‌న వ్య‌క్తం చేశారు.ముంద‌స్తునే . రైళ్లను, మెట్రోలను, రోడ్డు మార్గాలను నిలిపివేశారు. కాగా.. విమానంలో సీజేపీ నేతలు వస్తే.. విమానం దిగడంతోనే వారిని అరెస్ట్ చేయడం నిజంగా భయాన్ని కలిగిస్తోంది. మోదీ ప్రజాస్వామ్యాన్ని పూర్తిగా కాలరాస్తున్నారు. ప్రధాని మోదీకి తాను దొంగ ఓట్లతోనే ఎన్నికల్లో గెలిచానని స్పష్టంగా తెలుసు.. అందుకే ఈ ఉద్యమాన్ని అణచివేసి తన మోసం బయటపడకుండా కాపాడుకోవడానికి ప్రయత్నిస్తున్నారు’ అని కేజ్రీవాల్ తీవ్రంగా ఆరోపించారు.

 

ఇవి కూడ చ‌ద‌వండి:
  1. బాడీ షేమింగ్‌పై ట్రోల్స్‌.. కత్రినా కైఫ్‌ స్ట్రాంగ్‌ కౌంటర్‌…?
  2. రాత్రి పడుకునే ముందు ఫోన్ చూస్తున్నారా…?
  3.  నెలకు సరుకులు కొంటున్నారా…? డబ్బులు ఆదా చేయోచ్చు…!
  4. పెద్ద‌పులి సంచారం…! భ‌యాందోళ‌న‌లో రైతులు…ప్ర‌జ‌లు

 

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు