Homeజాతీయంఢిల్లీలో ఘోరం.. ఒక్కసారిగా కుప్పకూలిన ఐదు అంతస్తుల భవనం

ఢిల్లీలో ఘోరం.. ఒక్కసారిగా కుప్పకూలిన ఐదు అంతస్తుల భవనం

క్రైమ్ మిర్రర్ :  దేశ రాజధాని ఢిల్లీలో బుధవారం భారీ భవనం కూలిన ఘటన కలకలం రేపింది. సీమాపురి ప్రాంతంలో ఐదు అంతస్తుల భవనం ఒక్కసారిగా కుప్పకూలడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. భవనం శిథిలాల కింద పలువురు చిక్కుకుని ఉండొచ్చనే అనుమానంతో అధికారులు వెంటనే సహాయక చర్యలు చేపట్టారు.

సమాచారం అందుకున్న వెంటనే ఢిల్లీ ఫైర్ సర్వీస్ సిబ్బంది, పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. రెస్క్యూ సిబ్బంది సహాయంతో శిథిలాలను తొలగించే పనులు ముమ్మరం చేశారు. భారీ రాళ్లు, కాంక్రీట్‌ శ్లాబ్‌లను తొలగిస్తూ లోపల ఎవరైనా చిక్కుకున్నారా అనే విషయాన్ని పరిశీలిస్తున్నారు. బాధితులు ఉంటే వారిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చేందుకు సహాయక బృందాలు నిరంతరం శ్రమిస్తున్నాయి.

భవనం కూలిన విషయం తెలియడంతో పరిసర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు ఘటనాస్థలికి చేరుకున్నారు. దీంతో సీమాపురి గోల్‌చక్కర్‌, డీఎల్‌ఎఫ్‌ భోపురా తదితర ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. రెస్క్యూ వాహనాలు, అంబులెన్స్‌లు ఘటనాస్థలికి వేగంగా చేరుకునేందుకు పోలీసులు ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరిస్తున్నారు.

సహాయక చర్యలకు ఆటంకం కలగకుండా రహదారులను ఖాళీగా ఉంచాలని పోలీసులు ప్రజలను కోరారు. రోడ్లపై వాహనాలను నిలిపివేయడం, పార్కింగ్ చేయడం, పెద్ద సంఖ్యలో గుమిగూడటం వంటివి చేయవద్దని సూచించారు.

ఇదిలా ఉండగా.. భవనం కూలిపోవడానికి గల కారణం ఏమిటన్నది ఇంకా స్పష్టంగా తెలియరాలేదు. ప్రమాదంలో ఎవరైనా మృతి చెందారా? శిథిలాల కింద ఎంతమంది చిక్కుకున్నారు? అనే అంశాలపై కూడా అధికారుల నుంచి పూర్తి సమాచారం వెలువడాల్సి ఉంది. సహాయక చర్యలు పూర్తయిన తర్వాతే ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.
also read : వరల్డ్ కప్ రేసులో టీమిండియా: షమీ, భువీల రీఎంట్రీ తప్పనిసరి అవుతుందా?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు