నగరంలోని బేగంపేట పోలీస్స్టేషన్ పరిధిలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. కన్నతండ్రే తన 8 ఏళ్ల కుమార్తెపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలు రావడం కలకలం రేపింది.
పోలీసుల వివరాల ప్రకారం.. కొన్ని రోజులుగా బాలిక పట్ల ఆమె తండ్రి అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నట్లు బాలిక తల్లి గుర్తించింది. దీంతో ఆమె పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు ఆధారంగా పోలీసులు బాలికను విచారించి వివరాలు సేకరించారు.
ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు వచ్చిన ఆరోపణలపై దర్యాప్తు ప్రారంభించారు. బాలికకు సంబంధించిన అంశం కావడంతో పోలీసులు ఘటనను సున్నితంగా విచారిస్తున్నారు.
మైనర్ బాలికపై లైంగిక వేధింపులకు సంబంధించిన కేసు కావడంతో నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను దర్యాప్తు అనంతరం వెల్లడించనున్నట్లు సమాచారం.
also read: AI ఫోటోలతో మహిళకు వేధింపులు.. ప్రభుత్వ పాఠశాల హెచ్ఎంపై కేసు
