Homeతెలంగాణపనిచేయని బిజెపి నేతలు అవుట్...!

పనిచేయని బిజెపి నేతలు అవుట్…!

  • హై కమాండ్ సీరియస్ ఆదేశాలు

  • అభయ్ పాటిల్ టీం రంగంలోకి..

  • వణికి పోతున్న సీనియర్లు

క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో: తెలంగాణలో బిజెపి నేతలకు షాక్ తప్పడం లేదు. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా అధికారంలోకి రావాలని బిజెపి అధిష్టానం భావిస్తోంది. అందుకు విరుద్ధంగా కొంతమంది నేతలు సొంత అజెండాతో ముందుకు సాగుతున్నారు. ఇలా అయితే రాష్ట్రంలో అధికారంలోకి రావడం కల్లా అని తేలిపోతుంది.

అందుకే హై కమాండ్ దూకుడు పెంచుతోంది. మొహమాటలకు పోకూడదని భావిస్తోంది. పార్టీని గాడిలో పెట్టేందుకు సహా ఇంచార్జ్ అభయ్ పాటిల్, శివ ప్రకాష్, మధుకర్ లకు ప్రత్యేక బాధ్యతలు ఇచ్చారు. వీరు సమీక్షలు మొదలుపెట్టారు. ఒక్కొక్కరి జాతకాలను బయటపెట్టి చెడామడా తిట్టేస్తున్నారు.

క్షేత్రస్థాయిలో పార్టీ కోసం కనీసం పనిచేయకుండా, కేవలం హైదరాబాదులోని ఏసీ రూముల్లో కూర్చుంటూ.. పార్టీ ఆఫీసు చుట్టూ లాబీయింగ్ చేసుకునే నాయకుల తీరును బయటపెట్టి కడిగేస్తున్నారు. జిల్లాల్లో పనిచేయకుండా, ప్రజల్లో తిరగకుండా పార్టీ ఆఫీసు చుట్టూ తిరుగుతూ.. మేనేజ్ చేసుకుంటే వచ్చే ఎన్నికల్లో ఎలా అధికారంలోకి వస్తామని నిలదీస్తున్నారు.

  • కార్యాలయాల్లో కాలక్షేపం..

వాస్తవానికి బిజెపిలో క్రియాశీలక సభ్యత్వం లేని వారు సైతం.. రాష్ట్రస్థాయిలో పార్టీలో వివిధ హోదాల్లో పనిచేస్తున్నారు. క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్న కార్యకర్తకు గుర్తింపు లేదు కానీ.. కార్యాలయాల్లో రాజకీయం చేస్తున్న వారికి మాత్రం పెద్దపీట వేస్తున్నారు. అటువంటి వారిని ఇప్పుడు అభయ్ పాటిల్ బృందం ఏరివేసే పనిలో ఉంది.

పదవులు పొందిన తర్వాత ఆయా నేతలు కేవలం హైదరాబాద్ కి పరిమితమై.. హెడ్ క్వార్టర్స్ లోనే కాలక్షేపం చేస్తున్నారు. కేవలం ముగ్గురు పదాధికారులు తప్ప.. మిగిలిన వారు తమకు కేటాయించిన జిల్లాల వైపు కన్నెత్తి చూడడం లేదు.

రాష్ట్రస్థాయి నేతల నియోజకవర్గాల్లో తిరగకపోతే.. జిల్లా అధ్యక్షులను ఎలా ప్రశ్నిస్తారని మీరు నేతలను నిలదీస్తున్నారు. ఇకపై పదవులు అనుభవిస్తూ జిల్లాల్లో పర్యటించని వారిపై వేటు తప్పదని.. ఏసీ గదుల్లో కూర్చుని నేతల టూర్లను ఇకపై నేరుగా అధిష్టానమే పర్యవేక్షిస్తుందని హెచ్చరించారు.

  • నిధుల దుర్వినియోగం పై రచ్చ..

మరోవైపు నిధుల దుర్వినియోగంపై కూడా బిజెపిలో పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. గత మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ విడుదల చేసిన ఎన్నికల నిధుల దుర్వినియోగంపై.. అభయ్ పాటిల్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఎన్నికల సమయంలో అభ్యర్థులకు ఖర్చుల నిమిత్తం పార్టీ కేంద్రం నుంచి పంపించిన నిధులను క్షేత్రస్థాయికి చేర్చకుండా.. కొందరు నేతలు తమ సొంత ఖాతాల్లోకి మళ్లించి వాడుకున్నారని గుర్తించారు. పార్టీ నిధులను మింగేసిన వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలే ప్రసక్తి లేదని హెచ్చరించారు.

వారి వెనుక ఎవరున్నా ఉపేక్షించబోమని స్పష్టం చేశారు. పార్టీ సొమ్మును దుర్వినియోగం చేసిన నాయకులపై అవసరమైతే క్రిమినల్ కేసులు నమోదు చేసి.. జైలుకు పంపించేందుకు కూడా వెనుకడుగు వెయ్యమని హెచ్చరించారు. దీంతో బీజేపీ నేతల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి.

  • కఠినంగా అభయ్ పాటిల్..

మరోవైపు అభయ్ పాటిల్ కఠినంగా ఉంటారన్న పేరు ఉంది. ఆయన వైఖరితో సీనియర్ నేతలు తెలంగాణలో కొంచెం కంగారుగా ఉన్నారు. ఆయనను తెలంగాణ బాధ్యతలను తప్పించాలని కూడా ప్రయత్నం చేశారు. అదే విషయాన్ని బాహటంగానే ఆయన చిక్కుకొచ్చారు.

తాను రాష్ట్ర బాధ్యతల నుంచి వెళ్లిపోతానని కొందరు సంబరాలు చేసుకున్న విషయాన్ని కూడా ప్రస్తావించారు. గ్రూపు రాజకీయాలు నడుపుతూ.. లాబీయింగ్ తో పదవులు దక్కించుకునే సంస్కృతికి ఇక తెరపడినట్టేనని స్పష్టం చేశారు. బిజెపిలో పని చేయని నాయకులను పక్కన పెట్టేస్తామంటూ కూడా బాహటంగానే హెచ్చరించారు.

Anji Peraboina
Anji Peraboinahttp://www.crimemirror.com
పేరబోయిన ఆంజనేయులు ప్రస్తుతం క్రైమ్ మిర్రర్ తెలుగు దినపత్రికలో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు. తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాల అప్డేట్లు, మౌలిక సదుపాయాల అభివృద్ధి, రాజకీయ పరిణామాలు మరియు ప్రత్యేక కథనాలను సమగ్రంగా అందిస్తున్నారు. జర్నలిజం రంగంలో 7 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన ఆయన, గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో రాష్ట్ర వార్తలు మరియు రాజకీయ విశ్లేషణలు రాశారు. క్షేత్రస్థాయిలో రాజకీయ సర్వేల్లో పాల్గొన్న అనుభవంతో పాటు, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ మరియు పరిశోధనాత్మక జర్నలిజంలో ప్రత్యేక నైపుణ్యం సంపాదించారు. తెలంగాణ రాజకీయ పరిణామాలపై లోతైన అవగాహనతో పాటు, ప్రజలకు నమ్మకమైన సమాచారం అందించడంలో అంజి కృషి కొనసాగుతోంది. తన ప్రతిభకు గుర్తింపుగా, 2025 ఆగస్టులో ఉత్తమ పనితీరు కోసం జర్నలిస్టు అవార్డు అందుకున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు