Homeతెలంగాణసిరిసిల్ల‌కు నిధులు ఎందుకు ఇవ్వ‌లేదు...! క‌విత‌...

సిరిసిల్ల‌కు నిధులు ఎందుకు ఇవ్వ‌లేదు…! క‌విత‌…

సిరిసిల్ల‌, క్రైమ్‌మిర్ర‌ర్‌: సిరిసిల్ల‌కు స్వ‌యంగా నిధులు కేటాయించే అవ‌కాశం ఉన్న‌ప్ప‌టికీ నిధులు ఎందుకు కేటాయించలేద‌ని ముఖ్య‌మంత్రి రేవంత్‌రెడ్డిని టీఆర్ ఎస్ చీఫ్ క‌ల్వకుంట్ల క‌విత ప్ర‌శ్నించారు. రేవంత్ రెడ్డికి రాజ‌కీయాలు త‌ప్ప మ‌రే అంశంపై దృష్టి లేద‌ని విమ‌ర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా సిరిసిల్ల.. వేములవాడ ప్రాంతాల్లో ఒక్క ఎకరాకు కూడా నీరు రాలేదని ఆమె ఆరోపించారు. ఇప్పుడు మంత్రి ప‌ద‌వి ఇస్తామ‌ని చెప్పి ఓట్లు అడుగ‌డం సిగ్గుచేట‌న్నారు.

సిరిసిల్ల‌కు మంత్రి ప‌ద‌వి కొత్త ఏమికాద‌ని అన్నారు. అంతేగాకుండా వేములవాడ ఆలయ అభివృద్ధిపై కూడా కవిత కీలక వ్యాఖ్యలు చేశారు. ఆలయ అభివృద్ధిని కాంక్రీట్‌ నిర్మాణాలతో కాకుండా కృష్ణా శిలతో చేపట్టాలని సూచించారు. ఆలయానికి ఉన్న చారిత్రక.. ఆధ్యాత్మిక ప్రాధాన్యాన్ని దృష్టిలో పెట్టుకుని అభివృద్ధి పనులు చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు. నేరెళ్ల ఇసుక బాధితులకు కోటి రూపాయల పరిహారం ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. సిరిసిల్ల, వేములవాడ ప్రాంతాల అభివృద్ధి, సాగునీటి సమస్యలు, నేరెళ్ల బాధితుల అంశాలపై ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని కవిత కోరారు.

ఇవి కూడ చ‌ద‌వండి:
  1. విద్యార్థినుల మధ్య ఘర్షణ.. మనస్తాపంతో విద్యార్థిని ఆత్మహత్యాయత్నం
  2.  సీఎం చంద్ర‌బాబు, డీప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్ బేటి…! స్థానిక ఎన్నిక‌ల‌పై చ‌ర్చ‌…
  3.  ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో పాఠశాలలకు దసరా సెలవులు ఖరారు.. పూర్తి వివరాలు ఇవే!
  4.  బ్యాంక్ ఉద్యోగుల కష్టాలు తీరేదెన్నడు?.. తక్షణమే ‘5 డేస్ వర్కింగ్’ అమలు చేయాలని కవిత డిమాండ్

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు