క్రైమ్ మిర్రర్ : పదో తరగతి నుంచి ఉన్న పరిచయాన్ని ఆసరాగా చేసుకుని ఓ వివాహితపై టీజీఎస్పీ కానిస్టేబుల్ అత్యాచారానికి పాల్పడ్డాడని ఆరోపణలు వచ్చాయి. ఘటనను రహస్యంగా వీడియో తీసి, వాటిని సోషల్ మీడియాలో వైరల్ చేస్తానంటూ బాధితురాలిని బెదిరించినట్లు ఫిర్యాదు నమోదైంది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కరీంనగర్ రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
జయశంకర్ భూపాలపల్లి జిల్లా మల్హర్ మండలంలోని ఓ గ్రామానికి చెందిన యువతి ప్రస్తుతం భర్తతో కలిసి కరీంనగర్లో నివసిస్తోంది. పదో తరగతి చదువుతున్న సమయంలో ఆమెకు పరిచయమైన ఉదయ్ ప్రస్తుతం హైదరాబాద్‌లోని టీజీఎస్పీ 8వ బెటాలియన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నాడు. పాత పరిచయంతో తరచూ ఫోన్లో మాట్లాడేవాడని బాధితురాలు పోలీసులకు తెలిపింది.
ఈ ఏడాది మార్చి 3న కరీంనగర్లో ఉదయ్ తనపై అత్యాచారానికి పాల్పడ్డాడని, ఆ ఘటనను తనకు తెలియకుండా వీడియోగా చిత్రీకరించాడని ఆమె ఫిర్యాదులో పేర్కొంది. ఆ తర్వాత వీడియోలను సోషల్ మీడియాలో పెడతానంటూ బెదిరించి పలుమార్లు లైంగికంగా వేధించాడని ఆరోపించింది.
రూ.1.30 లక్షలు తీసుకున్నట్లు ఆరోపణ
వీడియోలను బయటకు పంపుతానని బెదిరిస్తూ ఆగస్టు 20, 21 తేదీల్లో తన నుంచి మొత్తం రూ.1.30 లక్షలు తీసుకున్నాడని బాధితురాలు తెలిపింది. డబ్బులు ఇచ్చిన తర్వాత కూడా వేధింపులు కొనసాగాయని పేర్కొంది. తర్వాత ఉదయ్ తన ఇంటికి వచ్చి గొడవ చేయడంతో పాటు తన ఫొటోలు, వీడియోలను భర్తకు పంపినట్లు ఫిర్యాదులో వెల్లడించింది. వాటిని చూసిన భర్త, కుటుంబ సభ్యులు తనను ఇంటి నుంచి పంపించారని తెలిపింది.
వేధింపుల సమయంలో గర్భస్రావం
తాను గర్భిణిగా ఉన్న సమయంలో జరిగిన ఈ వేధింపుల కారణంగా గర్భస్రావం కూడా జరిగిందని బాధితురాలు పోలీసులకు వివరించినట్లు సమాచారం.
జీరో ఎఫ్ఐఆర్తో కేసు బదిలీ
ఈ ఘటనపై బాధితురాలు తొలుత జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని ఓ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. అక్కడ పోలీసులు జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసి, కేసును కరీంనగర్ రూరల్ పోలీసులకు బదిలీ చేశారు. కేసు స్వీకరించిన కరీంనగర్ రూరల్ పోలీసులు నిందితుడు ఉదయ్‌పై సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఘటనకు సంబంధించిన ఆధారాలు, వీడియోలు, ఆర్థిక లావాదేవీలు తదితర అంశాలను పోలీసులు పరిశీలిస్తున్నట్లు సమాచారం.
also read : పోలీస్‌స్టేషన్‌లో ఆత్మహత్యాయత్నం.. టీ స్టాల్ నిర్వాహకుడు మృతి
