Homeఆంధ్ర ప్రదేశ్బొలెరో, ఆర్టీసీ బ‌స్సు ఢీ...! ఇద్ద‌రు మృతి....

బొలెరో, ఆర్టీసీ బ‌స్సు ఢీ…! ఇద్ద‌రు మృతి….

నంద్యాల‌, క్రైమ్‌మిర్ర‌ర్‌: ఆర్టీసీ బ‌స్సు , బొలేరో వాహ‌నం ఢీకొట్టిన ఘ‌ట‌న‌లో ఒక‌రు మృతి చెందిన ఘ‌ట‌న ఆత్మ‌కూరు మండ‌లం బైర్లూటి స‌మీపంలో చోటు చేసుకుంది. ఈ ప్ర‌మాద ఘ‌ట‌న‌లో ఈడిగ దేవేందర్‌ గౌడ్‌, నితిన్‌ మృతి చెందినట్లు పోలీసులు గుర్తించారు. మరో వ్యక్తి తీవ్రంగా గాయపడటంతో అతడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ప్రమాదం కారణంగా ఘాట్‌ రోడ్డులో కొద్దిసేపు వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.

గుంటూరు నుంచి కర్నూలు వైపు వెళ్తున్న బొలేరో వాహనం.. కర్నూలు నుంచి కాకినాడ వెళ్తున్న ఆర్టీసీ బస్సు బైర్లూటి వద్ద ఎదురెదురుగా ఢీకొన్నాయి. ప్రమాద తీవ్రతకు బొలేరో వాహనం దెబ్బతినగా, అందులో ప్రయాణిస్తున్న ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. ఆర్టీసీ బస్సు డ్రైవర్‌, కండక్టర్‌ స్వల్ప గాయాలతో బయటపడ్డారు. బస్సులోని ప్రయాణికులు సురక్షితంగా ఉన్నారు. సమాచారం అందుకున్న ఆత్మకూరు పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసి ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు.

 

ఇవి కూడ చ‌ద‌వండి:
  1. రామాయణం షూటింగ్ సెట్‌లో అగ్నిప్రమాదం.. తప్పిన పెను ముప్పు
  2. శంషాబాద్‌లో అర్ధరాత్రి ఏటీఎం చోరీ.. రూ.30 లక్షలకు పైగా నగదు అపహరణ
  3.  చదువులో వెనుకబడ్డారని 82 మంది విద్యార్థులకు సగం గుండు.. మహారాష్ట్రలో కలకలం
  4. గుర్తు తెలియ‌ని వాహ‌నం ఢీకొని ఒక‌రు మృతి…!

 

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు