ఢిల్లీ, క్రైమ్‌మిర్రర్: టెస్లా స్పేస్ ఎక్స్ చెప్పగానే గుర్తుకు వచ్చేది క్ ఆంత్రప్రెన్యూర్ ఎలాన్ మస్క్ తాజాగ రెండో సారి కూడ ఆయనే ట్రిలియనీర్‌గా నిలిచాడు. సోమవారం ఆయన నికర సంపద 65 బిలియన్ డాలర్ల మేర పెరిగి 1.04 ట్రిలియన్లకు చేరుకుంది. . ఈ నెల ప్రారంభం నుంచి నేటి వరకూ స్పేస్ ఎక్స్ సంస్థ షేరు విలువ 13 శాతం మేర పెరగ్గా టెస్లా షేరు ధర కూడా 6.7 శాతం మేర ఎగబాకింది. సంవత్సరంలో మస్క్ సంపద ట్రిలియన్ డాలర్ల మార్కు దాటడం ఇది రెండోసారి.
ఈ ఏడాది జూన్‌లో మస్క్ తొలిసారిగా ప్రపంచపు మొట్టమొదటి ట్రిలియనీర్‌గా మారిన విషయం తెలిసిందే. ఐపీఓ నేపథ్యంలో స్పేస్ ఎక్స్ సంస్థ షేర్లు భారీగా పెరగడంతో మస్క్ నికర సంపద విలువ కూడా పెరిగింది. అయితే, సంస్థ మార్కెట్ విలువపై అంచనాలు ఉండవల్సిన దానికంటే ఎక్కువగా ఉన్నట్టు నిపుణులు భావిండచంతో షేర్ల అమ్మకాలు పెరిగాయి. ఫలితంగా మస్క్ నికర సంపద అప్పట్లో ట్రిలియన్ డాలర్ల మార్కు దిగువకు పడిపోయింది. కాగా మళ్లీ పెరిగి రెండోసారి ట్రిలియనీర్‌గా అవతరించారు.
ఇవి కూడ చదవండి:
-
ఘోర రోడ్డు ప్రమాదం…! భార్యభర్తలు స్పాట్లోనే…
-
వరల్డ్ కప్ ముందు ప్రయోగాలా? టీమిండియా బౌలింగ్ వైఫల్యంపై హనుమ విహారి ఫైర్!
-
రౌడీ హీరో విజయ్ దేవరకొండ కెరీర్‌కు రష్మిక లైఫ్ ఇస్తుందా? ఆశలన్నీ ‘రణబాలి’ పైనే!
-
ముంబై పోలీసులమంటూ వృద్దుడికి సైబర్ నేరగాళ్ల భారీ టోకరా…!
