క్రైమ్ మిర్రర్, స్పోర్ట్స్:- వెస్టిండీస్ తో జరుగుతున్న సిరీస్‌లో భారత క్రికెట్ జట్టు బౌలింగ్ ప్రదర్శన పట్ల టీమిండియా బ్యాటర్ హనుమ విహారి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. విండీస్ బ్యాటర్లను కట్టడి చేయడంలో బౌలర్లు దారుణంగా విఫలమవుతున్నారని, దీనిపై కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని ఆయన మండిపడ్డారు.
ఒక మ్యాచ్‌లో 350 పరుగుల భారీ స్కోరును కూడా మన బౌలర్లు డిఫెండ్ చేసుకోలేకపోవడం తీవ్ర నిరాశ కలిగించిందని విహారి పేర్కొన్నారు. అంతకుముందు జరిగిన మరో మ్యాచ్‌లో సైతం భారత బౌలర్లు ఏకంగా 405 పరుగులు ప్రత్యర్థికి సమర్పించుకున్నారని ఆయన గుర్తు చేశారు. ఇలాంటి పేలవమైన ప్రదర్శన చూస్తుంటే భారత జట్టు ఆటతీరు మెరుగుపడాల్సింది పోయి వెనక్కి వెళ్తున్నట్లుగా అనిపిస్తోందని విహారి ఆవేదన వ్యక్తం చేశారు. ఇది జట్టుకు చాలా భారీ ఎదురుదెబ్బ అని ఆయన అభిప్రాయపడ్డారు.
తుది జట్టులో స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా, ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా లేని లోటు మైదానంలో చాలా స్పష్టంగా కనిపిస్తోందని ఆయన విశ్లేషించారు. మరో ఏడాదిలో వరల్డ్ కప్ లాంటి మెగా టోర్నీ జరగనున్న తరుణంలో, జట్టులో ఇలాంటి ప్రయోగాలు చేయడం ఏమాత్రం సరికాదని హనుమ విహారి స్పష్టం చేశారు.
రౌడీ హీరో విజయ్ దేవరకొండ కెరీర్‌కు రష్మిక లైఫ్ ఇస్తుందా? ఆశలన్నీ ‘రణబాలి’ పైనే!
