Homeక్రైమ్హైద‌రాబాద్‌లో భారీ అగ్ని ప్ర‌మాదం...!

హైద‌రాబాద్‌లో భారీ అగ్ని ప్ర‌మాదం…!

హైద‌రాబాద్‌, క్రైమ్‌మిర్ర‌ర్‌: హైద‌రాబాద్‌లో వ‌రుస‌గా అగ్ని ప్ర‌మాదాలు జ‌రుగుతుండ‌డంతో ప్ర‌జ‌లు భ‌యాందోళ‌న‌ల‌కు గుర‌వుతున్నారు. తాజాగా సోమ‌వారం బాలాపూర్ న‌బిల్ కాల‌నీలోని ప్లాస్టిక్ గోదాంలో తెల్ల‌వారుజామున భారీ అగ్ని ప్ర‌మాదం చోటు చ ఏసుకుంది. ఒక్క‌సారిగా ఆ ప్రాంతంలో పొగ‌, దూళి క‌మ్ముక‌పోయి ప్ర‌జ‌లు తీవ్ర భ‌యాందోళ‌న‌ల‌కు గుర‌య్యారు. గోదాంలో నిల్వ కెమిక‌ల్ డ్ర‌మ్ములు భారీ శ‌బ్దంతో ఒక్క‌సారిగా పేల‌డంతో మంట‌లు ఎగిసిప‌డుతున్నాయి. ప్ర‌మాదం జ‌రిగిన వెంట‌నే స్థానికులు అగ్నిమాప‌క సిబ్బందికి స‌మాచారం అందించారు.

ఫైర్ ఇంజిన్‌ల‌తో ఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకున్న ఫైర్ సిబ్బందిఓ మంట‌లను ఆర్పివేస్తున్నారు. కాగా ప్ర‌మాదంపై పోలీసులు కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేప‌డుతున్నారు. గోదాం వద్ద ఉన్న సెక్యూరిటీ సిబ్బందిని ఈ అగ్నిప్రమాదంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని పోలీసులు తెలిపారు. షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ అగ్ని ప్రమాదం జరిగి ఉండవచ్చని చెప్పారు. ఈ అగ్ని ప్రమాదం కారణంగా కోట్లాది రూపాయిల నష్టం వాటిల్లిందని ప్లాస్టిక్ గోదాం యజమానులు వెల్లడించారు.

 

ఇవి కూడ చ‌ద‌వండి:
  1. తాగునీటి ట్యాంక్‌లో బల్లి మృతి.. 12 మంది కార్మికులకు అస్వస్థత
  2. వరద బాధితులకు సాయం చేస్తుండగా విషాదం.. హెలికాప్టర్ నుంచి పడిన ప్యాకెట్‌తో వ్యక్తి మృతి
  3. కడపలో అత్త దారుణ హత్య.. అల్లుడి ఆత్మహత్యాయత్నం
  4.  అమృతమ్మ అదృశ్యం కేసులో ట్విస్ట్.. దారుణ హత్యగా నిర్ధారణ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు