Homeక్రైమ్ప్రియుడితో ఉన్న మహిళపై లైంగిక దాడి.. సూత్రధారిగా వ్యవహరించింది ఎవరో తెలిస్తే షాక్!

ప్రియుడితో ఉన్న మహిళపై లైంగిక దాడి.. సూత్రధారిగా వ్యవహరించింది ఎవరో తెలిస్తే షాక్!

కేరళలోని త్రిస్సూర్‌లో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. తమిళనాడుకు చెందిన ఓ మహిళ తన ప్రియుడితో కలిసి లాడ్జిలో ఉండగా.. ఐదుగురు వ్యక్తులు పోలీసులమంటూ గదిలోకి ప్రవేశించారు. అనంతరం వారిద్దరినీ బలవంతంగా కారులో ఎక్కించుకుని తీసుకెళ్లినట్లు పోలీసులు తెలిపారు.

ఆ తర్వాత ప్రియుడిపై దాడికి పాల్పడిన నిందితులు.. అతడి చేతులు, కాళ్లకు తీవ్ర గాయాలయ్యేలా కొట్టినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. మహిళపై కూడా అత్యాచారానికి పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. ఘటనపై బాధితులు పోలీసులను ఆశ్రయించడంతో దర్యాప్తు ప్రారంభించారు.

విచారణలో పోలీసులకు కీలక సమాచారం లభించింది. ఈ ఘటనకు మహిళ ప్రియుడి భార్యే సూత్రధారిగా వ్యవహరించినట్లు పోలీసులు గుర్తించారు. తన భర్త మరో మహిళతో లాడ్జిలో ఉన్నాడని తెలుసుకున్న ఆమె.. అతడి లొకేషన్‌ను ట్రాక్ చేసి ముఠా సభ్యులకు సమాచారం అందించినట్లు దర్యాప్తులో తేలింది.

లొకేషన్ సమాచారం ఆధారంగా నిందితులు లాడ్జికి చేరుకుని పోలీసులమంటూ గదిలోకి ప్రవేశించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అనంతరం జరిగిన దాడి, అత్యాచారంపై కేసు నమోదు చేసి నిందితుల పాత్రపై దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

also read: అక్రమ గుట్కా తయారీ కేంద్రం గుట్టురట్టు.. రూ.50 లక్షల సొత్తు స్వాధీనం

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు