Homeక్రైమ్సెల్‌ఫోన్‌ ఆశ చూపించి చిన్నారిపై లైంగిక దాడి.. నిందితుడు పరారీ

సెల్‌ఫోన్‌ ఆశ చూపించి చిన్నారిపై లైంగిక దాడి.. నిందితుడు పరారీ

క్రైమ్ మిర్రర్ : ఆడుకుంటున్న పసికందుపై ఓ వ్యక్తి లైంగిక దాడికి ఒడిగట్టిన దారుణ ఘటన రంగారెడ్డి జిల్లా మంచాల మండలం లోయపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. పోలీసులు, బాధితురాలి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. లోయపల్లికి చెందిన బి.నరేందర్ అలియాస్ నాని (40) అనే వ్యక్తి బుధవారం (సెప్టెంబరు 30న) తన ఇంటి వద్ద ఆడుకుంటున్న నాలుగేళ్ల బాలికకు సెల్‌ఫోన్ ఆశ చూపించి లోపలికి పిలిచాడు. అనంతరం చిన్నారిపై అసభ్యకరంగా ప్రవర్తించి లైంగిక దాడికి తెగబడ్డాడు.

ఆ రాత్రి పాప తీవ్ర నొప్పితో కలవరపడటంతో తల్లి సాధారణ నొప్పిగా భావించి సర్దిచెప్పారు. అయితే గురువారం నాటికి నొప్పి మరింత ఎక్కువ కావడంతో చిన్నారి మళ్లీ ఏడ్చింది. అనుమానం వచ్చిన తల్లి పరిశీలించగా రహస్య భాగాలపై గాయాలు కనిపించాయి. దీంతో బాలిక తాను ఎదుర్కొన్న దారుణాన్ని తల్లిదండ్రులకు వివరించింది.

విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు వెంటనే గురువారం రాత్రి 10:30 గంటల సమయంలో ‘డయల్ 100’కు ఫిర్యాదు చేశారు. మంచాల సీఐ మధు తెలిపిన వివరాల ప్రకారం.. బాధితురాలి తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు అర్ధరాత్రి 1 గంట సమయంలో నిందితుడిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఘటన అనంతరం నిందితుడు పరారీలో ఉన్నాడని, అతని కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టినట్లు సీఐ వెల్లడించారు. పసికందుపై ఘాతుకానికి పాల్పడిన నిందితుడిని వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.
also read ;విద్యుత్ షాక్‌తో గృహిణి మృతి.. గల్ఫ్‌లో ఉన్న భర్తకు తీరని శోకం

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు