Homeతెలంగాణరేవంత్ మరో బాంబు...!

రేవంత్ మరో బాంబు…!

  • హైదరాబాదులో స్టార్ హోటళ్లు, విల్లాలు, సర్వీస్ అపార్ట్మెంట్లు అన్నీ కేటీఆర్ వే

  • ఆధారాలతో సహా చూపిస్తా

  • సిరిసిల్ల నుంచి ముఖ్యమంత్రి కీలక ప్రకటన

  • డిఫెన్స్ లో గులాబీ పార్టీ

క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో: గులాబీ అగ్రనేతల విషయంలో సీఎం రేవంత్ రెడ్డి చాలా దూకుడుగా ఉన్నారు. ఇప్పటివరకు వారి ఆస్తులపై, ఫామ్ హౌస్ లపై మాట్లాడారు. ఆధారాలతో సహా ఆరోపణలు చేశారు. అయితే ఇప్పుడు మరో బాంబు పేల్చారు.

కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్ల లో పర్యటించిన సందర్భంగా సంచలన ప్రకటనలు చేశారు. కేటీఆర్ ను లక్ష్యంగా చేసుకొని రేవంత్ చేసిన ఆరోపణలు తెలంగాణ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఇన్నాళ్లు కేవలం జన్వాడ ఫామ్ హౌస్, విల్లాల చుట్టూనే సాగిన ఆస్తుల వివాదాన్ని సీఎం రేవంత్ మరింత ముందుకు తీసుకెళ్లారు.

  • సంచలన ప్రకటనలు..

సిరిసిల్లలో సీఎం రేవంత్ సంచలన ప్రకటన చేశారు. మరోసారి కేటీఆర్ ను టార్గెట్ చేసుకున్నారు.ఐటీ కారిడార్ లోని లగ్జరీ స్టార్ హోటల్ వ్యాపారం వైపు మళ్ళించారు. కేటీఆర్ కుటుంబానికి హైదరాబాద్ ఐటీ కారిడార్ లోనే కాకుండా ప్రధాన ప్రాంతాల్లో దక్కన్ సెరాయి పేరుతో పలు స్టార్ హోటళ్లు, సర్వీసు అపార్ట్మెంట్లు ఉన్నాయని సంచలన ఆరోపణలు చేశారు.

మైండ్ స్పేస్ వద్ద 100 అడుగుల స్టార్ హోటల్, కొండాపూర్ లో 120 గదుల లగ్జరీ ప్రాపర్టీ తో పాటు అట్ హోమ్ హాస్పిటాలిటీ పేరుతో భారీ నెట్వర్క్ నడుస్తోందని బహిరంగంగా ప్రకటించారు. పొలిటికల్ వర్గాల్లో ఇది అలజడి రేపుతోంది. అయితే రేవంత్ రెడ్డి యధాలపంగా చెప్పిన మాటలు ఇవి కావు. పక్క ఆధారాలతో పాటు రికార్డులను చేతిలో పెట్టుకొని ఈ ఆరోపణలు బయటపెట్టారు. ఇన్ని రోజులు తన తండ్రికి, తనకు కనీసం ఇల్లు కూడా లేదని చెప్పుకొచ్చారు కేటీఆర్.

వాటినే సెటైరికల్ గా తిప్పి కొట్టిన రేవంత్ హైటెక్ సిటీ పక్కనున్న ఆ స్టార్ హోటళ్లు, బిజినెస్ ఎస్టేట్లు నీవి కాదని ప్రమాణం చేయగలవా? నీ ఆస్తులపై వైట్ పేపర్ విడుదల చేసే ధైర్యం ఉందా? వన్ టూ సవాల్ విసిరారు. ఆ ఆస్తులు కేటీఆర్ కుటుంబానివేనని నిరూపిస్తానని… లేకపోతే తన పేరు మార్చుకుంటానంటూ ఓపెన్ ఛాలెంజ్ విసిరారు రేవంత్ రెడ్డి.

  • అనుమానాలకు బలం..

వాస్తవానికి గులాబీ పార్టీ హయాంలోనే ఐటీ కారిడార్ లోని దక్కన్ సెరాయి హోటల్స్, లగ్జరీ సర్వీస్ ప్రాపర్టీలు బాగా విస్తరించాయి. వాటి వెనుక కేసీఆర్ కుటుంబానికి చెందిన కీలక ముసుగు సంస్థలు ఉన్నట్టు స్పష్టమవుతోంది. అధికారంలో ఉన్నప్పుడు సాధించిన పొలిటికల్ ప్రాబల్యాన్ని, ఐటీ కారిడార్ లోని ల్యాండ్ కేటాయింపులను ఈ హోటల్ నెట్వర్క్ విస్తరణకు వాడుకున్నారని అనుమానాలు ఇప్పుడు బలపడుతున్నాయి.

రేవంత్ రెడ్డి అత్యంత విశ్వసనీయ సమాచారంతోనే ఈ విషయాన్ని సిరిసిల్ల సభ వేదికగా ఎండగట్టగలిగారు. సీఎం రేవంత్ విసిరిన వైట్ పేపర్ సవాల్ తో పూర్తిగా డిఫెన్స్ లో పడిపోయారు కేటీఆర్. ఇప్పటివరకు సోషల్ మీడియా వేదికగా సెటైరికల్ గా మాట్లాడే వారు కేటీఆర్. కానీ గ్రౌండ్ లెవెల్ లోకి వెళ్లి సీఎం రేవంత్ బయట పెడుతున్న ఈ విషయాలు తెలంగాణ పొలిటికల్ వర్గాలపై తీవ్రంగా ప్రభావం చూపుతున్నాయి. ప్రధానంగా కేటీఆర్ డిఫెన్స్ లో పడుతున్నారు.

Anji Peraboina
Anji Peraboinahttp://www.crimemirror.com
పేరబోయిన ఆంజనేయులు ప్రస్తుతం క్రైమ్ మిర్రర్ తెలుగు దినపత్రికలో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు. తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాల అప్డేట్లు, మౌలిక సదుపాయాల అభివృద్ధి, రాజకీయ పరిణామాలు మరియు ప్రత్యేక కథనాలను సమగ్రంగా అందిస్తున్నారు. జర్నలిజం రంగంలో 7 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన ఆయన, గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో రాష్ట్ర వార్తలు మరియు రాజకీయ విశ్లేషణలు రాశారు. క్షేత్రస్థాయిలో రాజకీయ సర్వేల్లో పాల్గొన్న అనుభవంతో పాటు, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ మరియు పరిశోధనాత్మక జర్నలిజంలో ప్రత్యేక నైపుణ్యం సంపాదించారు. తెలంగాణ రాజకీయ పరిణామాలపై లోతైన అవగాహనతో పాటు, ప్రజలకు నమ్మకమైన సమాచారం అందించడంలో అంజి కృషి కొనసాగుతోంది. తన ప్రతిభకు గుర్తింపుగా, 2025 ఆగస్టులో ఉత్తమ పనితీరు కోసం జర్నలిస్టు అవార్డు అందుకున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు