అమరావతి, క్రైమ్‌మిర్రర్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి ఆలయ అధికారులు ఇంద్రకిలాద్రిపై వెలిసిన దుర్గామల్లేశ్వర స్వామి దసరా ఉత్సవాలకు రావాలని కోరుతూ ఆహ్వానం పంపించారు. ఇంద్రకిలాద్రిపై అక్టోబరు 11 నుంచి 20 వరకు దసరా ఉత్సవాలు జ రుగనున్నాయి. ఈ నేపథ్యంలో బుధవారం క్యాంప్ కార్యాలయంలో దుర్గగుడి అధికారులు, చైర్మన్ బొర్రా రాధాకృష్ణ ఆధ్వర్యంలో సీఎంను కలిసి దసరా ఉత్సవాలకు రావాల్సిందిగా ఆహ్వానం పలికారు. ఈ సందర్భంగా దసరా మహోత్సవాలకు సంబంధించిన ఆహ్వానపత్రికను అందజేశారు.
ఈ సందర్భంగా ఆలయ అర్చకులుఅమ్మవారి ప్రసాదాన్ని సీఎంకు అందజేసి వేదాశీర్వచనం చేశారు. అనంతరం ఉత్సవాల ఏర్పాట్లపై సీఎం చంద్రబాబు.. అధికారులను అడిగి తెలుసుకున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. దుర్గగుడి చైర్మన్‌తో పాటు.. దేవాదాయ శాఖ కమిషనర్ రామచంద్రమోహన్, ఈఓ శీనా నాయక్, బోర్డు సభ్యులు.. సీఎంను ఆహ్వానించిన వారిలో ఉన్నారు.
ఇవి కూడ చదవండి:
-
కేటీఆర్ అంత పని చేస్తే కవిత ఊరుకుంటారా…!
-
కల్కి భగవాన్ కన్నుమూత…!
-
టీచర్ ను కొట్టిన టిడిపి ఎమ్మెల్యే…!
-
ఆ రెండు జడ్పీ లపై వైసీపీ గురి…!
