ఒంగోలు, క్రైమ్మిర్రర్: ఒంగోలు జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ రిటైర్డ్ ఉద్యోగి బాలికలపై అత్యాచారయత్నం చేసిన ఘటన ఆ ప్రాంతంలో కలకలం రేపింది. ఓ వసతి గృహంలో ఉంటున్న బాలికలను తండ్రి డెత్ సర్టిఫికేట్ ఇప్పిస్తానని నమ్మించి హాస్టల్ నుంచి వంట మనిషి బయటకు తీసుకొచ్చింది. ఈ క్రమంలో బాలికను రిటైర్డ్ ఉద్యోగి వద్ద వంట మనిషి వదిలిపెట్టి వెళ్లింది. దీంతో బాలికలను ఇంట్లో బందించి అత్యాచారయత్నం చేసినట్లు తెలిసింది.
కాగా బందువులకు మరో బాలిక ఫోన్ చేసి సమాచారం ఇచ్చింది. దీంతో బందువులకు పోన్ చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. అతడి ఇంటిలో ఉన్న మరో బాలికను బందువులు వచ్చి కాపాడారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి పోలీసులు చేరుకుని వివరాలు సేకరించారు. రిటైర్డ్ ఉద్యోగిని అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్నారు. డీఆర్డీఏలో పనిచేసి అతడు రిటైర్ అయ్యాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని ఒంగోలు పోలీసులు విచారణ జరుపుతున్నారు.
ఇవి కూడ చదవండి:
-
హోటల్ గదిలో మహిళ దారుణ హత్యా…! నిందితుడు పరార్…
-
తుదిశ్వాస విడిచిన ప్రముఖ ఆధ్యాత్మిక గురువు కల్కి భగవాన్!
-
బీఆర్ఎస్లో భగ్గుమన్న అంతర్గత విభేదాలు.. కేటీఆర్కు కవిత తీవ్ర హెచ్చరిక!
-
శ్రీశైలం ప్రాజెక్టులో అడుగంటుతున్న నీటి నిల్వలు.. ఆందోళనలో అధికారులు
