ఎన్నికల వివాదాల నేపథ్యంలో ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ కీలక వ్యాఖ్యలు చేశారు. సీఈసీని కాకుండా నేరుగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీనే రాజీనామా చేయాలని ఆదేశించాల్సిందిగా సీజేపీ (CJP)కి ఆయన సూచించారు.అధికారుల తొలగింపులపై ఆయన స్పందిస్తూ.. ‘మొదట ప్రధాన్, ఇప్పుడు జ్ఞానేష్ను బాధ్యతల నుంచి తప్పుకోమంటున్నారు. కానీ, వాస్తవానికి వీరిని తెరవెనుక ఉండి నడిపిస్తున్నది ప్రధానే’ అని కేజ్రీవాల్ విమర్శించారు.
మరోవైపు, కేజ్రీవాల్ చేసిన ఈ వ్యాఖ్యలపై పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఆమ్ ఆద్మీ పార్టీ సైతం ముందు నుంచి సీఈసీనే టార్గెట్ చేస్తోందని, ఇప్పుడు సీజేపీకి సలహా ఇచ్చే బదులుగా.. ఒక ఆర్గనైజ్డ్ పార్టీగా ఆప్ ఎందుకు స్వయంగా ఈ స్టాండ్ తీసుకోవడం లేదని పలువురు విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు.
విరాట్ కోహ్లీలో ఆ కసి ఏమాత్రం తగ్గలేదు : రోహిత్ శర్మ
