హైదరాబాద్, క్రైమ్‌మిర్రర్: టీమిండియాకు ఇప్పటి వరకు చీఫ్ సెలెక్టర్‌గా ఉన్న అజిత్ అగార్కర్ తప్పుకున్న విషయం తెలిసిందే. దీంతో టీమిండియాకు కొత్త చీఫ్ సెలెక్టర్ పదవిపై తీవ్రమైన ఉత్కంఠ నెలకొంది. కాగా ప్రస్తతుం తాత్కలికంగా సెలక్షన్ కమిటీని ప్రజ్ఞాన్ ఓజానే బాధ్యతలు నిర్వహిస్తున్నారు. కాగా ప్రస్తతుం ఓ జానే పూర్తి స్థాయి చీఫ్ సెలెక్టర్ బాధ్యతలు చేపట్టే అవకాశం ఉందని వార్త కథనాలు వెలువడుతున్నాయి. గువాహటిలో భారత కోచ్ గౌతమ్ గంభీర్‌తో జరిగిన కీలక సమావేశంలోనూ ఓజా పాల్గొనడంతో ఈ వార్తలకు బలం చేకూరింది. వెస్టిండీస్‌తో రెండో వన్డేకు ముందు గువాహటిలోని బర్సాపరా స్టేడియంలో ఈ సమావేశం జరిగింది. వెస్టిండీస్ ఆటగాళ్లు ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో.. భారత జట్టు విశ్రాంతి తీసుకుంటోంది. సాధారణంగా ద్వైపాక్షిక సిరీస్ జరుగుతున్న సమయంలో సెలక్షన్ కమిటీ మొత్తం ఇలా సమావేశం కావడం అరుదే. దీంతో ఈ భేటీకి ప్రాధాన్యం ఏర్పడింది. భారత్ తదుపరి న్యూజిలాండ్ పర్యటనకు వెళ్లాల్సి ఉంది. ఈ పర్యటనకు సంబంధించిన జట్ల ఎంపిక, ఆటగాళ్లపై చర్చించేందుకే గంభీర్‌తో సెలెక్టర్లు సమావేశమైనట్లు తెలుస్తోంది.
ప్రజ్ఞాన్ ఓజా క్రీడా నేపథ్యం…
ఎడమచేతి వాటం స్పిన్నర్ ప్రజ్ఞాన్ ఓజా భారత్ తరుపు 24 టెస్టులు ఆడాడు. క్రికెట్ నుంచి రిటైర్డ్ అయిన తరువాత బీసీసీ సెలెక్షన్ కమిటీలో చోటు దక్కించుకున్నాడు. అగార్కర్ వైదొలగడంతో తాత్కాలికంగా చీఫ్ సెలెక్టర్ బాధ్యతలు చేపట్టాడు. ఇప్పుడు పూర్తిస్థాయి చీఫ్ సెలెక్టర్‌గా అతడినే కొనసాగించే అవకాశాలు ఉన్నట్లు సమాచారం.
ఇవి కూడ చదవండి:
-
సీఐఎస్ఎఫ్ క్యాంప్‌లో కాల్పులు.. నలుగురు సిబ్బంది మృతి
-
ఫుట్‌బాల్ జట్టు బస్సును అడ్డగించిన సాయుధులు.. ఆటగాళ్లపై దాడి, విలువైన వస్తువుల దోపిడీ
-
థియేటర్‌లో 22 నిమిషాలు ప్రకటనలు.. యాజమాన్యానికి రూ.75 వేల జరిమానా
-
గంగా ఆసుపత్రి వైద్యుల సేవలకు హీరో రామ్ చరణ్ ప్రత్యేక ధన్యవాదాలు
