Homeజాతీయంపార్టీ విలీన ప్రచారంపై శరద్ పవార్ క్లారిటీ..!

పార్టీ విలీన ప్రచారంపై శరద్ పవార్ క్లారిటీ..!

తమ పార్టీని వేరే పార్టీలో విలీనం చేస్తారంటూ గత కొంతకాలంగా జరుగుతున్న ప్రచారంపై ఎన్‌సీపీ చీఫ్ శరద్ పవార్ స్పందించారు. ఈ ఊహాగానాలన్నింటినీ ఆయన పూర్తిగా కొట్టిపారేశారు. “మేం ఎక్కడికీ వెళ్లడం లేదు.. ఎవరితోనూ కలవడం లేదు.. మీకు రావాలని ఉంటే రండి, మాతో జాయిన్ అవ్వండి” అని ఆయన స్పష్టం చేశారు. పార్టీని మరింత బలోపేతం చేయాల్సిందేనని, తమ రాజకీయ ప్రయాణం విషయంలో కార్యకర్తలు ఎవరూ ఎలాంటి గందరగోళానికి గురికావద్దని పిలుపునిచ్చారు.

కాగా, ఎన్‌సీపీ, ఎన్‌సీపీ(ఎస్పీ) రెండు వర్గాలు మళ్లీ విలీనం అవుతాయని, శరద్ పవార్ ఎన్‌డీఏ కూటమిలో చేరుతారంటూ ఇటీవల జోరుగా వార్తలు రావడం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన చేసిన ఈ తాజా వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో స్పష్టతనిచ్చాయి.

ఆస్ట్రేలియా క్రికెట్ జట్టుకు ఏమైంది? వన్డేల్లో డిఫెండింగ్ ఛాంపియన్ల పేలవ ప్రదర్శనపై ఆందోళన!

ఓయో గదిలో ప్రియురాలి హత్య కేసు: నిందితుడికి రిమాండ్

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది. పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు