Homeతెలంగాణబుల్డోజ‌ర్ల‌తో పేద‌ల ఇళ్ల‌ను కూల్చివేయ‌డం దారుణం...! రేవంత్ స‌ర్కార్‌పై హ‌రీశ్‌రావు ఫైర్‌

బుల్డోజ‌ర్ల‌తో పేద‌ల ఇళ్ల‌ను కూల్చివేయ‌డం దారుణం…! రేవంత్ స‌ర్కార్‌పై హ‌రీశ్‌రావు ఫైర్‌

హైద‌రాబాద్‌, క్రైమ్‌మిర్ర‌ర్‌: త‌న నియోజ‌క‌వ‌ర్గం అని, కొడంగ‌ల్ బిడ్డ‌ను అని చెప్పుకొంటూ సొంత నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌ల ఇళ్ల‌ను రేవంత్ స‌ర్కార్ కూల్చివేయ‌డం అత్యంత దారుణ‌మ‌ని అన్నారు. నియోజ‌క‌వ‌ర్గంలోని మ‌ద్దూరులో రాత్రికి రాత్రే ఇళ్ల‌పై బుల్డోజ‌ర్ల‌ను ప్ర‌యోగించ‌డంపై బీఆర్ ఎస్ నేత హ‌రీశ్ రావు ఎక్స్‌వేదిక‌గా ఫైర్ అయ్యారు. సొంత నియోజ‌క‌వ‌ర్గ‌మ‌ని చెప్పుకుంటూ పేద‌ళ ఇళ్ల‌పై ప్ర‌తాపం చూప‌డం ఏంట‌ని ప్రశ్నించారు. క నీసం నోటీసులు ఇవ్వ‌కుండా వారి ఇళ్ల‌ను కూల్చి వేసి న‌డిరోడ్డు మీద నెట్టే|శాడ‌ని మండిప‌డ్డారు. న్యాయస్థానాల తీర్పులను సైతం లెక్కచేయకుండా పోలీసులను అడ్డుపెట్టుకుని సాగిస్తున్న ఈ బుల్డోజర్ రాజు ప్రజాపాలన అనిపించుకోదని మండిపడ్డారు. దశాబ్దాలుగా నివాసం ఉంటున్న నిరుపేదలను అర్ధరాత్రి రోడ్డున పడేయడం అత్యంత కర్కశమని ధ్వజమెత్తారు.

అధికారం ఉంద‌ని ఎవ‌రిని లెక్క చేయ‌కుండా వ్య‌వ‌హ‌రించ‌డం ప‌నికి మాలిన చ‌ర్య‌గ అభివ‌ర్ణించారు. త‌క్ష‌ణ‌మే ప్ర‌భుత్వం బాధ్య‌త వ‌హించాల‌ని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ గొప్పగా చెప్పుకునే యూపీఏ హయాంలోని భూసేకరణ చట్టం–2013 ప్రకారం ఇళ్లు కోల్పోయిన ప్రతి కుటుంబానికి న్యాయమైన పరిహారం, మెరుగైన పునరావాసం కల్పించాలని స్పష్టం చేశారు. పేదల బతుకులను ఛిన్నాభిన్నం చేస్తున్న ఈ అప్రజాస్వామిక చర్యలను బీఆర్ఎస్ పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నామని, బాధితులకు అండగా నిలవాలని ఆయన డిమాండ్ చేశారు. అంతేగాకుండా రాబోయే కాంగ్రెస్ పార్టీకి ప్ర‌జ‌లు త‌గిన బుద్ది చెబుతార‌ని హెచ్చ‌రించారు.

 

ఇవి కూడ చ‌ద‌వండి:

 

  1. తెలంగాణ అభివృద్ధికి ప్రధాని మోదీ సహకరించడం లేదు: ఢిల్లీ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర ఆరోపణలు!
  2. LPUలో తీవ్ర హింసాత్మక నిరసనలు, విధ్వంసం.. ప్రాణభయంతో ఇళ్లకు తిరుగుముఖం పడుతున్న తెలుగు విద్యార్థులు!
  3. ఫార్ములా-ఈ కేసులో కీలక పరిణామం: కేటీఆర్ పాస్‌పోర్ట్ జప్తు చేయాలని కోర్టు ఆదేశం!
  4. 150 ఏళ్ల వేడుకలు.. ఒంగోలులో ఘనంగా 150 గిత్తలతో భారీ ప్రదర్శన, ప్రత్యేక పోటీలు!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు